iVOOMi Scooter: మార్కెట్ లోకి ఇవూమి ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా ద్విచక్ర

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకూ మార్కెట్లో క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి వినియోగదారుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఓలా,టీవీఎస్ కంపెనీలు.. ఈ రెండు కంపెనీలు తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈ రెండు కంపెనీలకు పోటీగా మరో స్కూటర్ కూడా మార్కెట్లోకి విడుదల అయింది.

అదే ఇవూమి ఎలక్ట్రిక్ స్కూటర్. బడ్జెట్ ధరలోనే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇవూమీ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసింది. ఇందులో మీకు శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. మరి ఈ స్కూటర్ ఫీచర్స్,ధర విషయానికి వస్తే.. ఈ స్కూటర్ లో 60 వీ, 35 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి 250 డబ్ల్యూ మోటార్ కూడా ఉంది. ఈ స్కూటర్ ను చార్జర్ సహాయంతో చార్జ్ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది.

అదేవిదంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. అలాగే ఈ స్కూటర్ ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇకపోతే ధర విషయనికి వస్తే..ఇవూమి స్కూటర్ లో అత్యాధునిక ఫీచర్లను అందించారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ స్పీడోమీటర్, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ట్రిప్ మీటర్, యాంటీ థెఫ్ట్ అలారం, యూఎస్ బీ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఆపరేషన్, పార్కింగ్ స్విచ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ డీఆర్, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి. అలాగే భారతీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.81,499గా ఉంది. అయితే ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం రూ. 85,287 వరకూ ఉంటుంది.