Itel A05S : అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో అదరగొడుతున్న ఐటెల్‌ స్మార్ట్ ఫోన్?

వినియోగదారులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది ఐటెల్ (Itel).

Published By: HashtagU Telugu Desk
Itel Smart Phone With Amazing Features At The Lowest Price..

Itel Smart Phone With Amazing Features At The Lowest Price..

Itel A05S Smart Phone : ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐటెల్‌ మార్కెట్లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది ఐటెల్ (Itel). అందులో భాగంగానే ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన ఐటెల్ సంస్థ తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈసారి కూడా బడ్జెట్ ధరలోనే అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆ స్మార్ట్ ఫోన్ ఏది? ఆ ఫోన్ ధర, ఫీచర్ల విషయానికొస్తే..

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఐటెల్‌ ఏ05ఎస్‌ (Itel A05S) పేరుతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్‌లో తీసుకురాగా ఇప్పుడు 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో మరో వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఇకపోతే ఐటెల్‌ ఏ05ఎస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 720 x 1,612 పిక్సెల్‌, 60Hz రిఫ్రెష్ రేట్, 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ UniSoC SC9863A ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఎస్‌కార్డు ద్వారా ఇంటర్నల్‌ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే.. ఐటెల్‌ ఏ05ఎస్‌ స్మార్ట్‌ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 5 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇకపోతే ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌కి వెనకాల అందించారు. ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అందించారు.

Also Read:  Hot Water: ఖాళీ కడుపుతో వేడినీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

  Last Updated: 25 Dec 2023, 03:13 PM IST