New Smartphone: మార్కెట్లోకి అతి తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవ?

దేశవ్యాప్తంగా రోజు రోజుకి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో మార్కెట్లోకి కూడా అదే స్థాయిలో స్మార్ట్ ఫోన్లు విడుదల

  • Written By:
  • Publish Date - June 11, 2023 / 10:10 PM IST

దేశవ్యాప్తంగా రోజు రోజుకి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో మార్కెట్లోకి కూడా అదే స్థాయిలో స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వినియోగదారుల కోసం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వందల స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లో ఉన్న విషయం మనం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ నెలలో కనీసం పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన ఐటెల్ సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

ఐటెల్ ఎస్23 మోడల్ స్మార్ట్‌ ఫోన్‌ను తాజాగా లాంచ్ చేసింది. 16జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కేవలం రూ.8,799 మాత్రమే. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. ఇకపోతే స్మార్ట్ ఫోన్ కు సంబంధించి మరిన్ని ఫీచర్ల విషయానికొస్తే.. తాజాగా లాంచ్ చేసిన ఐటెల్ ఎస్23 స్మార్ట్‌ఫోన్ సేల్ జూన్ 14వ నుంచి అమెజాన్‌లో ప్రారంభం కానుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్ మోడల్‌లో 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ మనకు మిస్టరీ వైట్, స్టారీ బ్లాక్ కలర్స్ లో లభించనుంది.

ఇంకా ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌, కలర్ ఛేంజింగ్ ప్యానెల్‌, అల్ట్రా వైలెట్ కిరణాల్లో ఫోన్ బ్యాక్ ప్యానెల్ రంగులు మారేలా అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ అక్టాకోర్ 12 నానో మీటర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌తో లాంచ్ అయింది. ఇకపోతే కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా సహా రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఫేషియల్ రికగ్నిషన్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా 10W వైర్డ్ ఛార్జింగ్‌ సప్పోర్ట్‌తో ఈ ఫోన్ వస్తుంది. కాగా, ఐటెల్ మనదేశంలో ఇటీవలే తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ ఐటెల్ ప్యాడ్ వన్‌ను లాంచ్ చేసింది. ఇంకా ఏ ఏడాది ప్రారంభంలో ఐటెల్ ఎల్ సిరీస్ స్మార్ట్ టీవీలను కూడా లాంచ్ చేసింది.