Site icon HashtagU Telugu

Itel A70: తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న ఐటెల్‌ సరికొత్త స్మార్ట్ ఫోన్?

Mixcollage 04 Jan 2024 08 32 Pm 9024

Mixcollage 04 Jan 2024 08 32 Pm 9024

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వందల రకాల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో చలామణి అవుతున్న విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లో మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఎక్కువగా బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని రోజుకో ఫోన్‌ సందడి చేస్తోంది. ముఖ్యంగా చైనాకు చెందిన పలు స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ కంపెనీలు మార్కెట్‌ను బడ్జెట్‌ ఫోన్‌లతో ముంచెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐటెల్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకురాబోతోంది. ఐటెల్‌ ఏ70 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జవనరి 5వ తేదీ నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఐటెల్‌ ఏ70 స్మార్ట్‌ ఫోన్‌ బ్రిలియంట్‌ గోల్డ్‌, ఫీల్డ్‌ గ్రీన్‌, స్టైలిష్ బ్లాక్‌, అజూర్‌ బ్లూ కలర్స్‌లో లభించనున్నాయి. అమెజాన్‌ తో పాటు పలు రిటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇందులో 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇక స్క్రీన్‌లో ప్రత్యేకంగా డైనమిక్‌ బార్‌ను అందిస్తున్నారు.

దీంతో ఇది యూజర్లకు నోటిఫికేషన్స్‌కు సంబంధించి బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. టైప్‌సీ ఛార్జింగ్ పోర్ట్ ఈ ఫోన్‌ సొంతం. ధర విషయానికొస్తే ఐటెల్‌ ఏ70 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,299కాగా, 4 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,799గా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ విషయానికొస్తే రూ.7,299గా నిర్ణయించారు. ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో ఎంపిక చేసిన పలు బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇకపోతే ఈ కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన హెచ్‌డీఆర్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. ఫేస్‌ అన్‌లాక్‌తో పాటు, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను అందించారు. ఈ ఫోన్‌ ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.