Site icon HashtagU Telugu

Aadhaar Card: పాన్ కార్డుని ఆధార్ కార్డుతో త్వరగా లింక్ చేయండి.. లేదంటే భారీగా జరిమానా?

Aadhaar Card

Aadhaar Card

భారత్ లో ఈ మధ్యకాలంలో ఆధార్ తో పాటు పాన్ కార్డు కూడా కీలకంగా మారింది. కాగా ఇటీవలే ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయమని ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ మీరు ఒకవేళ మీరు పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే వెంటనే త్వరగా చేయించుకోవాలి. లేదంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు మార్చి 31, 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ లోపు పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా 1000 జరిమానా కూడా విధించవచ్చు.

అయితే ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం కోసం పలుసార్లు గడువును పొడిగించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరొకసారి మార్చి 31, 2023 వరకు గడువును మరొకసారి పెంచింది ఆదాయపు పన్ను శాఖ. అయితే నిర్ణీత సమయంలో పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయకపోతే అది ఇన్ ఆక్టివ్ గా మారుతుంది. అంతేకాకుండా పాన్ కార్డుకు అవసరమైన అన్ని ప్రక్రియలు కూడా నిలిపివేయబడతాయి. నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత నిర్ణీత అథారిటీకి ఆధార్‌ను నివేదించిన తర్వాత పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయవచ్చని డిపార్ట్‌మెంట్ తెలిపింది.

అయినప్పటికీ, మార్చి 31, 2023 వరకు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం, రీఫండ్‌ల ప్రాసెసింగ్ మొదలైన చట్టం ప్రకారం వారి పాన్‌లు పనిచేస్తాయని సీడీబీటి తెలిపింది. మరి పాన్ కార్డు ని ఆధార్ తో ఏ విధంగా లింక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మొదట ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, ఆపై ఆధార్ కార్డ్‌లో ఇచ్చిన పేరు, పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. దీని తర్వాత, ఆధార్ కార్డులో ఇచ్చిన పుట్టిన సంవత్సరానికి టిక్ చేయండి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ఆపై లింక్ మద్దతు బటన్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ పాన్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడుతుంది.

Exit mobile version