Site icon HashtagU Telugu

Chandrayaan 3 : చంద్ర‌యాన్ 3 లాంచ్‌కి ముహూర్తం ఖ‌రారు

Isro Somnath

Isro Somnath

స్టోరీ హైలైట్స్ –

-ఈ ఏడాది మొత్తం 19 మిష‌న్స్ ప్లాన్ చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌
– ఆగ‌స్టు 2022 నాటికి చంద్రయాన్ 3 లాంచింగ్‌కు ముహూర్తం ఖ‌రారు
– ఈ ఏడాది మొత్తం 8 లాంచ్ వెహికల్స్‌, 7 స్పేస్‌క్రాఫ్ట్‌లు, 4 టెక్నాల‌జీ డిమాన్స్‌ట్రేట‌ర్ మిష‌న్స్‌

చంద్ర‌యాన్ ప్రాజెక్ట్‌పై లోక్‌స‌భ‌లో కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది మొత్తం 19 మిష‌న్స్‌కు ప్లాన్ చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌.. చంద్ర‌యాన్ 3ని ఆగ‌స్టు 2022లో లాంచ్ చేయాల‌ని ముహూర్తం ఫిక్స్ చేసింది. చంద్ర‌యాన్ 2 ప‌రిశోధ‌న‌ల ఫ‌లితాల‌ను అన‌లైజ్ చేసిన శాస్త్ర‌వేత్త‌లు, చంద్ర‌యాన్ 3 లాంచ్‌పై ఒక క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది మొత్తం 8 లాంచ్ వెహికల్స్‌, 7 స్పేస్‌క్రాఫ్ట్‌లు, 4 టెక్నాల‌జీ డిమాన్స్‌ట్రేట‌ర్ మిష‌న్స్‌ను లాంచ్ చేయ‌బోతున్న‌ట్టు లోక్‌స‌భ‌లో కేంద్రం తెలిపింది. కోవిడ్ 19 వ‌ల్ల అనేక లాంచ్‌లు లేట‌యిన‌ట్టు తెలిపిన కేంద్రం.. స్పేస్ సెక్టార్‌లో వ‌చ్చిన మార్పుల‌తో మ‌రికొన్ని ప్రాజెక్ట్‌ల‌ను రీడిజైన్ చేసిన‌ట్టు ప్ర‌క‌టించింది.

2021 ఆగ‌స్టు 12న EOS-03, 2021 ఫిబ్ర‌వ‌రి 28న Amazonia-1, ఫిబ్ర‌వ‌రి 28, 2012న Satish Dhawan SAT (SDSAT), అదే రోజున UNITYsatల‌ను లాంచ్ చేశారు.