Site icon HashtagU Telugu

Aditya-L1 Mission: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఇస్రో.. సూర్యుడి దిశగా ఆదిత్య L1?

Aditya L1 Mission

Aditya L1 Mission

సూర్యుడిపై పరిశోధనకు ఇస్రో సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 మిషన్ తాజాగా అర్థరాత్రి 2 గంటల నుంచి సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది. కొన్ని రోజులుగా అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంది. క్రమంగా దాని కక్ష్యా మార్గాన్ని పెంచుతూ పోయిన ఇస్రో రాత్రి పూర్తిగా భూ కక్ష్య నుంచి దాన్ని బయటకు పంపించేసింది. దాంతో ఆదిత్య L1 మిషన్ ఇప్పుడు భూమి ఆకర్షణ కంట్రోల్ నుంచి విడిపోయి సూర్యుడి వైపుగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు.

ఈ మిషన్ దాదాపు 110 రోజుల పాటు ప్రయాణించి15 లక్షల కిలోమీటర్ల జర్నీని పూర్తి చేసి సూర్యుడి లాంగ్రేజియన్ పాయింట్ 1ని చేరుకోనుంది. అలా చేరేందుకు దాన్ని సరైన దిశలో నెట్టాల్సి ఉంటుంది. ఆ నెట్టే ప్రక్రియను రాత్రి 2 గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా విశ్వంలోకి లేదా మరో ఖగోళం వైపు స్పేస్‌క్రాఫ్ట్‌ను వరుసగా ఐదోసారి విజయవంతంగా ఇస్రో పంపినట్లైంది. ఈ మేరకు ఇస్రో సంస్థ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. L1 పాయింట్ అనేది ఓ రకమైన కక్ష్యా మార్గం. ఈ మార్గంలో సూర్యుడు నిరంతరం స్పేస్‌క్రాఫ్ట్‌కి కనిపిస్తూనే ఉంటాడు. అందువల్ల సూర్యుడిపై ఏం జరిగినా క్షణాల్లో ఆ విషయాన్ని ఆదిత్య L1 ఇస్రోకి తెలుపుతుంది అని రాసుకొచ్చారు..

 

ఇకపోతే భారత పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవలే చంద్రయాన్ 3 ప్రయోగించగా అది సక్సెస్ఫుల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా కూడా ఆదిత్య L1 దిశగా వెళుతుంది అని తెలిపారీ. చంద్రుడి దక్షిణ ధృవంపై ఇస్రో దింపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్ర లేచే సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 22 లేదా 23న వాటిని స్లీప్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్‌లోకి మార్చనుంది ఇస్రో. అప్పుడు అవి పనిచేస్తే మరో 2 వారాలపాటూ వాటి నుంచి ఇస్రో కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది.