ISRo Gaganyaan: “గగన్ యాన్” వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిమ్యులేటర్!

భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘‘గగన్ యాన్’’ 2024లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Gaganyaan Crew Imresizer

Gaganyaan Crew Imresizer

భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘‘గగన్ యాన్’’ 2024లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గగన్ యాన్ కు సంబంధించిన టెస్ట్ ప్లైట్ కోసం “స్పేస్ ఫేరింగ్” హ్యూమనాయిడ్ రోబోను ఉపయోగించనున్నారు. ఈ రోబోకు ‘వ్యోమ్ మిత్ర’ అని పేరు పెట్టారు. దీంతోపాటు ‘‘గగన్ యాన్’’ మిషన్ కు ఎంపిక చేసిన నలుగురు ఎయిర్ ఫోర్స్ పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిమ్యులేటర్ అభివృద్ధి పై ఇస్రో దృష్టి పెట్టింది. ఇప్పటికే వాళ్ళు రష్యాలో ప్రాథమిక దశ ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్నారు.
దీనికి అదనంగా.. నిజమైన గగన్ యాన్ మిషన్ ను తలపించే వాతావరణాన్ని కలిగిన సిమ్యులేటర్ ను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి కలిగిన కంపెనీల నుంచి బిడ్లను ఇస్రో ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన కంపెనీలు సెప్టెంబర్ 30లోగా కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వర్చువల్ రియాలిటీ తో గగన్ యాన్ సిమ్యులేటర్ ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఎంపికయ్యే కంపెనీకి అప్పగిస్తారు. వ్యోమనౌక ను ఎలా కంట్రోల్ చేయాలి ? వ్యోమనౌకలోని టూల్స్ ని ఎలా ఉపయోగించాలి ? అనే అంశాలపై వ్యోమగాములకు శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా ఆ కంపెనీ పైనే ఉంటుంది. ఏక కాలంలో ఇద్దరు వ్యోమగాములకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సరిపడే నిడివితో సిమ్యులేటర్ ను నిర్మించనున్నారు.

ఏమిటీ ప్రయోగం?

‘‘గగన్ యాన్’’ ప్రయోగాన్ని
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ దేశాలు మాత్రమే మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టాయి. ప్రస్తుతం భారత్ తన మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతోంది. దీంతో ఈ ప్రయోగాన్ని చేపట్టిన అతికొన్ని దేశాల సరసన భారత్ నిలుస్తుంది. అంతరిక్ష నౌకను భూమి నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగించి అక్కడ నుంచి పారాచూట్లను ఉపయోగించి క్యాప్సూల్ ద్వారా వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి ప్రయోగం చేస్తున్నారు. గగన్ యాన్ ట్రాక్ చేయడానికి రిలే ఉపగ్రహాలను వినియోగించనుంది.

  Last Updated: 14 Sep 2022, 11:22 PM IST