Site icon HashtagU Telugu

YouTube Skip Ad : యూట్యూబ్ ‘స్కిప్ యాడ్‌’ బటన్ తీసేశారా ? అసలు ఏమైంది ?

Youtube Skip Ad

YouTube Skip Ad : యూట్యూబ్.. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారింది. మనం రోజూ ఏం చూసినా చూడకున్నా.. యూట్యూబ్‌ను మాత్రం రెగ్యులర్‌గా చూస్తున్నాం. అది కూడా ఎంతో ఆతురతతో చూస్తున్నాం. ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానళ్లలో ఏమేం కొత్త కంటెంట్ వచ్చిందో తెలుసుకోవాలనే అమితాసక్తి ప్రతి యూజర్‌లో ఉంటోంది. అందుకే ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. ఒక్క క్లిక్‌తో యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేస్తున్నారు.తాజాగా  యూట్యూబ్‌లోని స్కిప్ యాడ్ బటన్‌పై చర్చ మొదలైంది. మనం యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే మధ్యలో కొన్ని స్కిప్ యాడ్స్ వస్తుంటాయి. కొన్ని సెకన్ల పాటు యాడ్ ప్లే అయ్యాక.. స్కిప్ యాడ్ అనే బటన్ ప్రత్యక్షం అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం సదరు యాడ్ నుంచి తప్పించుకొని వీడియోలోకి వెళ్లిపోతాం.  ఈవిధమైన స్కిప్ యాడ్‌లతో యూట్యూబ్(YouTube Skip Ad) ప్రతిరోజూ భారీగానే డబ్బులు సంపాదిస్తుంటుంది.  ఒకవేళ మనం చూసే వీడియోలలో యాడ్స్ రావొద్దని భావిస్తే తప్పకుండా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.

Also Read :Ola Refund : ఓలా క్యాబ్స్ బుక్ చేస్తారా ? కొత్త మార్పులు తెలుసుకోండి

‘స్కిప్ యాడ్’ ఇష్యూ ఏమిటి ? 

డెస్క్‌టాప్‌లో యూట్యూబ్‌ను చూసే కొందరు యూజర్స్‌ నుంచి ఇటీవలే ఆండ్రాయిడ్ అథారిటీకి పలు ఫిర్యాదులు అందాయి. తాము డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ వీడియోలను చూస్తుండగా వచ్చిన యాడ్స్‌లో ‘స్కిప్ యాడ్’ బటన్​పై గ్రే కలర్ బాక్స్ కనిపించిందని వారు తెలిపారు. అంతేకాకుండా ఆ వీడియోలలో ‘కౌంట్‌డౌన్ టైమర్’ కూడా కనిపించలేదని చెప్పారు. ఇంకొందరు యూట్యూబ్ యూజర్లు తమకు స్మార్ట్‌ఫోన్లలో  కూడా ‘స్కిప్ యాడ్’ బటన్ కనిపించలేదన్నారు.

Also Read :Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప భక్తుల దర్శనాలపై మూడు కీలక నిర్ణయాలు

స్కిప్ యాడ్ బటన్​‌పై యూట్యూబ్ క్లారిటీ 

యూజర్ల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదులను యూట్యూబ్ ప్రతినిధి ఖండించారు. స్కిప్పబుల్ యాడ్స్ ఇప్పటికీ స్పిప్ యాడ్ బటన్​ను కలిగి ఉన్నాయని స్పష్టం చేశారు. యూట్యూబ్​లో స్కిప్ యాడ్ బటన్​ను తీసివేసే ప్రసక్తే లేదన్నారు. అయితే యూట్యూబ్ వీడియో ప్లేయర్‌ను మరింత మెరుగ్గా, సౌకర్యవంతంగా యూజర్లకు చూపించేందుకు అదనపు ఫీచర్స్‌ను జోడిస్తున్నామని తెలిపారు. త్వరలోనే యూట్యూబ్ యూజర్స్ వీడియోలలో యాడ్‌లను స్కిప్ ​ చేసే సందర్భంగా కౌంట్‌డౌన్ టైమర్‌కు బదులుగా ప్రోగ్రెస్ బార్‌‌ను చూస్తారని చెప్పారు. స్కిప్ యాడ్ బటన్ అందుబాటులో ఉంటుందని.. దాని డిజైన్, లుక్ మాత్రం మారుతాయన్నారు.