Site icon HashtagU Telugu

Google Search: గూగుల్ సెర్చ్ లో మీ ఫోన్ నంబర్ ను తొలగించాలా?

Voice And SMS Packs

Voice And SMS Packs

గూగుల్ సెర్చ్ లో మీ మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు కనిపిస్తున్నాయా ? అయితే .. వాటిని తొలగించే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. వాస్తవానికి ఇంతకుముందు ఈ వెసులుబాటు ఉండేది కాదు. కేవలం గూగుల్ సెర్చ్‌లో కనిపించే ఆర్థికపరమైన వివరాలను మాత్రమే గూగుల్ డిలీట్ చేసేది. దీంతో తమ పర్సనల్ వివరాలను కూడా డిలీట్ చేయాల్సిందిగా గూగుల్ కు అనేక మంది నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తాయి. ఆలస్యంగానైనా వీటికి గూగుల్ స్పందించింది. గూగుల్ బ్లాగ్ స్పాట్ వేదికగా.. గూగుల్ గ్లోబల్ పాలసీ హెడ్ మిచెల్లీ చాంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీ వివరాలను డిలీట్ చేయాలంటూ అభ్యర్థనలు వెల్లువెత్తడంతో.. అందుకు అనుగుణంగా పాలసీ మార్చినట్లు తెలిపారు.

ఎలా డిలీట్ చేస్తారు ?

గూగుల్‌ సెర్చ్‌లో మీ వ్యక్తిగత వివరాలను తొలగించే క్రమంలో.. వెబ్ పేజీలను ఫిల్టర్ చేస్తారు. మీ వ్యక్తిగత వివరాలు ఏదైనా ప్రభుత్వ వెబ్ సైట్లో ఉంటే మాత్రం గూగుల్ ఆ వివరాలను తొలగించలేదు. గూగుల్ సెర్చ్ లో కనిపించే వివరాలను మాత్రమే డిలీట్ చేస్తుంది. వాస్తవానికి మీ వివరాలు పూర్తిగా ఇంటర్నెట్‌ నుంచి తొలగిపోవు. ఎందుకంటే. గూగుల్‌ మాదిరిగా అనేక సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి.వాటిలో మీ పర్సనల్ డేటా కనిపించే అవకాశం లేకపోలేదు. మీ ఫోన్‌ నంబర్‌ ను నమోదు చేసుకున్న వెబ్‌సైట్‌ను సంప్రదించండి.. మీ వ్యక్తిగత వివరాలను తొలగించాలని చెప్పండి.. అప్పుడు మాత్రమే మీ వివరాలను గూగుల్ సెర్చ్ లో కనిపించకుండా చేయొచ్చు.

Exit mobile version