Site icon HashtagU Telugu

Smart Phone Into TV Remote: స్మార్ట్ ఫోన్ నియోగదారులకు శుభవార్త.. ఆ యాప్ తో టీవీ రిమోట్ మొబైల్ లోనే?

Smart Phone Into Tv Remote

Smart Phone Into Tv Remote

మామూలుగా ఇంట్లో ఒక టీవీ ఉంది అంటే రిమోట్ విషయంలో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక కోపంలో ఎన్నో టీవీ రిమోట్ లు కూడా పగిలిపోతూ ఉంటాయి. టీవీ రిమోట్ విషయంలో అన్నా చెల్లెలు,భార్యాభర్తలు, అక్క తమ్ముడు మధ్య ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు టీవీ రిమోట్ ఎక్కడ పెట్టామో మరిచిపోతూ ఉంటాము. ఇక అటువంటి సమయంలో తెలియక మరొక కొత్త రిమోట్ ను కొనుగోలు చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు టీవీ రిమోట్ లేకపోవడం వల్ల టీవీ ని చూడలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది.

ఇక మీదట ఆ బాధ అక్కర్లేదు. ఎందుకంటే ఇకమీదట మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీ రిమోట్‌గా ఉపయోగించవచ్చు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. గూగుల్ టీవీ యాప్ సాయంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి మీ ఆండ్రాయిడ్ ఆధారిత టీవీని నియంత్రించవచ్చు. రిమోట్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఛానెల్‌లను మార్చవచ్చు. అలాగే వాల్యూమ్‌ను సర్దుబాటు చేయవచ్చు. అలాగే మీకు ఇష్టమైన యాప్‌లను కూడా ప్రారంభించవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ పని చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ఐఫోన్‌లో గూగుల్ టీవీ యాప్‌ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసి గూగుల్ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. తరువాత మీ టీవీ, ఫోన్ ఒకే వైఫై నెట్‌వర్క్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ టీవీకి వైఫై లేకపోతే, మీరు మీ ఫోన్, టీవీని కనెక్ట్ చేయడానికి బ్లూటూత్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు గూగుల్ టీవీ యాప్‌ను ఓపెన్ చేసి యాప్ తెరిచిన తర్వాత, దిగువ కుడి వైపున ఉన్న రిమోట్ బటన్‌ను నొక్కండి. యాప్ పరికరాల కోసం స్కాన్ చేయడం ప్రారంభిస్తుంది. మీ టీవీ కనుగొన్న తర్వాత జాబితా నుంచి దాన్ని ఎంచుకోవాలి. మీ టీవీ స్క్రీన్‌పై కోడ్ కనిపిస్తుంది. యాప్‌లో కోడ్‌ని నమోదు చేసి పెయిర్ చేయాలి. మీ ఫోన్‌ను మీ టీవీతో జత చేసిన తర్వాత మీరు సాధారణ రిమోట్‌తో నియంత్రించినట్లుగా టీవీని నియంత్రించడానికి దాన్ని ఉపయోగించవచ్చు.

Exit mobile version