Site icon HashtagU Telugu

Iqoo: ఐకూ జెడ్6 లైట్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటంటే?

iqoo z6 lite 5g

iqoo z6 lite 5g

ఐకూ నుంచి మరో కొత్త ఫోన్ ఈ నెలలోనే లాంచ్‌ కానుంది. అదే ఐకూ జెడ్‌ 6 లైట్ 5జీ. ఈ నెల 14న ఫోన్‌ విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారింగా ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్ ను తమ ఫోన్ లో అమర్చినట్టుగా ప్రకటించింది ఐకూ సంస్థ. అయితే ఈ కొత్త ఫోన్ ను సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అమెజాన్ తో పాటు పలు ఈ కామర్స్ వెబ్ సైట్లలో విక్రయించనున్నారు. అయితే ఈ ఐకూ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది. ఇకపోతే ఈ ఐకూ జెడ్ 6 లైట్ 5జీ ఫోన్ ప్రత్యేకతలు విషయానికి వస్తే..

ఈ ఫోన్ లో అమర్చిన స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ అత్యంత వేగంగా పనిచేస్తుందట. అలాగే మీడియాటెక్ డైమన్సిటీ 700 కంటే వేగవంతమైనదని ఐకూ సంస్థ పేర్కొంది. ఇక ఈ ఫోన్ లో వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఐ ఆటో ఫోకస్ సదుపాయంతో ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్టు వివరించింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్టు చేస్తుంది.

ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 127 గంటలు నిరంతరంగా మ్యూజిక్ వినొచ్చట. 18.5 గంటల యూట్యూబ్ వీడియోలు చూడవచ్చని లేదా 21.6 గంటల పాటు సోషల్ మీడియా యాప్స్ బ్రౌజ్ చేసుకోవచ్చని 8.3 గంటలు గేమ్స్ ఆడుకోవచ్చని కంపెనీ పేర్కొంది. కానీ ఈ ఫోన్ ధర, మరికొన్ని స్పెసిఫికేషన్ల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Exit mobile version