Iqoo: ఐకూ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. కెమెరా క్వాలిటీ మామూలుగా లేదుగా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ గురించి మనందరికీ తెలిసిందే. ఐకూ త్వరలోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ ఐకూ 11 సిరీస్‌ ను

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 03:00 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ గురించి మనందరికీ తెలిసిందే. ఐకూ త్వరలోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్ సిరీస్ ఐకూ 11 సిరీస్‌ ను విస్తరిస్తూ కొత్త ఐకూ 11 5జీ ని పరిచయం చేయనుంది. కాగా ఆ స్మార్ట్ ఫోన్ ను వచ్చే నెల అనగా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. Qualcomm ఫాస్టెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ తో ఈ స్మార్ట్ ఫోన్ రావొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ తో క్వాడ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ తో డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ అందించనుంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే..

ఇప్పటివరకు ఈ ఫోన్ ధరను ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ధర 50 వేలకు లోపుగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ iQOO 11 ప్రోతో పాటు 2023 ప్రారంభంలో పరిచయం చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఐకూ 11 5జీ చైనా తర్వాత లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇంకా Qualcomm ఫాస్టెస్ట్, లేటెస్ట్ స్నాప్‌ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో రానుంది. ఈ ఫోన్ UFS 4.0 స్టోరేజ్ ఆప్షన్‌ 128 జీబీ 256 జీబీ 512 జీబీ వరకు, LPDDR5x ర్యామ్ ఆప్షన్‌తో 8 జీబీ, 12 జీబీ ను పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల E6 AMOLED డిస్ ప్లే సపోర్ట్ ను కలిగి ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా సెటప్ విషయానికి వస్తే..

iQOO 11 5జీ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. కాగా ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ ఇందులో పోతున్నాయి. అలాగే సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కెమెరా తక్కువ లైట్ అండ్ పోర్ట్రెయిట్ మోడ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. iQOO 11 5G 5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.