Site icon HashtagU Telugu

Iqoo Z7 pro 5G: మార్కెట్ లోకి మరో కొత్త ఐక్యూ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

iQOO 12

Iqoo Z7 Pro 5g

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఐక్యూ సంస్థ భరత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఐక్యూ సంస్థ భారత మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఐక్యూ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఐక్యూ జెడ్‌7 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఆగస్టు 31వ తేదీన ఈ ఫోన్‌ భారత్‌ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ భారత్‌లో రూ. 25 నుంచి రూ. 30 వేల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఐక్యూ జెడ్‌7 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఐక్యూ జెడ్‌7 ప్రో స్మార్ట్ ఫోన్‌ లేటెస్ట్‌ ఆండ్రాయిడ్ వెర్షన్‌ ఆధారంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో కెమెరాకు సైతం అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 66 వాట్స్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉండనుంది.