Site icon HashtagU Telugu

iQOO Neo 10 Series: ఐక్యూ నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. లాంచింగ్ డేట్ ఫిక్స్!

Iqoo Neo 10 Series

Iqoo Neo 10 Series

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఐక్యూ భారత మార్కెట్లోకి ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ లో ఫోన్‌ లను లాంచ్‌ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఐక్యూ తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ఫోన్‌ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌ కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఫోన్‌ లాంచింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఐక్యూ నియో 10 సిరీస్‌ ఫోన్‌ ను నవంబర్‌ 29వ తేదీన మార్కెట్లోకి తీసుకొస్తున్నారట. తక్కువ బడ్జెట్‌ లోనే మంచి ఫీచర్ లతో ఈ ఫోన్‌ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్‌ కు సంబంధించిన నెట్టింట వైరల్‌ అవుతోన్న కొన్ని ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌.డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఇకపోతే స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 1.5 కే రిజల్యూషన్‌, 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. గేమింగ్ అనుభవం కోసం ఇందులో క్యూ2 చిప్‌ ను కూడా అందించారు.

ఇకపోతే ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ లో 61000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో కస్టమైజ్‌డ్ OISని అందిస్తున్నారు. దీంతో ఫొటోలు బ్లర్‌ కాకుండా ఉంటాయి. రెక్టాంగులర్‌ కెమెరా సెటప్‌ ను కూడా ఇందులో ఇవ్వన్నారు. పంచ్‌ హోల్‌ తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌ను ర్యాలీ ఆరెంజ్‌, షాడో బ్లాక్‌, వైట్‌ కలర్స్‌ లో తీసుకురానున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన కెమెరాను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 29వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.