Site icon HashtagU Telugu

iQOO Z9 Lite: కేవలం రూ. 10 వేలకే 5జీ ఫోన్‌.. ఫీచర్స్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

9d57bc4f16994dbe13adf5afbb9b330d

9d57bc4f16994dbe13adf5afbb9b330d

ప్రస్తుత రోజుల్లో రోజుకి దేశవ్యాప్తంగా 5జి సేవలు అంతకంతకు విస్తరిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్దపెద్ద సిటీల వరకు ప్రతి ఒక్క ప్రదేశంలో 5జీ హవానే నడుస్తోంది. దాంతో మార్కెట్లోకి ఎక్కువ శాతం 5జీ స్మార్ట్ ఫోన్ లే విడుదల అవుతున్నాయి. వినియోగదారులు కూడా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే 5జీ స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోకి 5జీ ఫోన్‌లు సైతం సందడి చేస్తున్నాయి. మొదట్లో భారీగా ధర పలికిన 5జీ ఫోన్‌ లు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి.

కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే 5జీ ఫోన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీలు కూడా ఒకదానిని మించి ఒకటి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. అందులో భాగంగానే రూ. 10 వేల మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్స్‌ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐక్యూ జెడ్‌ 9 లైట్‌ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ఐక్యూ జెడ్‌9 లైట్ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ ఫన్‌టచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ 14ని అందించారు.

ఇక ఈ ఫోన్‌ను ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్‌ వంటి కలర్స్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఈ ఫోన్‌ డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.57 ఇంచెస్‌ తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను కూడా అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇకపోతే బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 15 వాట్స్‌ ఛార్జింగ్‌ కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ కోసం ఇందులో వైఫై 5, బ్లూటూత్‌ 5.4, టైప్‌ సి యూఎస్‌బీ వంటి ఫీచర్ లను అందించారు. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే..

ఇందులో 50 మెగా పిక్సెల్‌, 2 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను కూడా అందించారు. ఇక ఇందులో సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఆప్షన్‌ ను ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే.. ఐకూ జెడ్‌9 లైట్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,499 కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,499 గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్ లో భాగంగా కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 500 ఇనస్టాంట్ డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ అమ్మకాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.