Site icon HashtagU Telugu

iQoo Z9s 5G: మార్కెట్లోకి రాబోతున్న ఐక్యూ సరికొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్!

Iqoo Z9s 5g

Iqoo Z9s 5g

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ సంస్థ భారత మార్కెట్లోకి ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఐక్యూ మార్కెట్ ని మరింత పెంచుకోవడం కోసం ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లతో పాటుగా మరిన్ని కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది ఐక్యూ. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఐక్యూ జెడ్‌9 ఎస్‌ పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆగస్టు 21వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

ఇకపోతే ఐక్యూ జెడ్‌9 ఎస్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ తో పని చేస్తుంది. ఈ సిరీస్‌ లో భాగంగా ఐక్యూ జెడ్‌ 9 ఎస్‌ 5జీ, ఐక్యూ జెడ్‌9 ఎస్‌ ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌ లను తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సూపర్ నైట్ మోడ్‌ ను అందించనున్నారు. దీంతో ఈ ఫోన్‌ సహాయంతో 4కే వీడియోలను రికార్డ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌ లో ప్రత్యేకంగా ఏఐ ఎరేజ్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్ ఫీచర్లను కూడా అందించారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. ఐక్యూ జెడ్‌9 ఎస్‌ 5జీ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 25 వేల లోపు ఉండవచ్చని అంచాన వేస్తున్నారు. ఈ ఫోన్‌ లో అదనంగా 8 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను ఇస్తున్నారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లామ్ బయాంట్ ఆరెంజ్, లుక్స్ మార్బుల్ పినిషెస్ వంటి కలర్స్‌ లో లభించనుంది. అలాగే ఈ రెండు ఫోన్‌ లలోనూ 7.49 ఎంఎం బాడీ, 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. అలాగే 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఈ స్క్రీన్‌ సొంతం అని చెప్పవచ్చు. అలాగే ఐక్యూ జడ్9ఎస్ ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 5500 పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. దీంతో సన్‌ లైట్‌లోనూ స్క్రీన్‌ స్పష్టంగా చూడవచ్చు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.