చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ 13 ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల అనగా డిసెంబర్ లో భారత మార్కెట్ లోకి ఈ ఫోన్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని కంపెనీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఐక్యూ ఇండియా ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే డిసెంబర్ లో కరెక్ట్ గా ఏ తేదీన తీసుకొస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. కాగా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
ఇక ఈ ఫోన్ లో క్యూ2 సూపర్ గేమింగ్ చిప్ ను కూడా అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో 2కే రిజల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ను కూడా అందించారు. చైనాలో ఈ ఫోన్ వైట్, గ్రీన్, బ్లాక్, గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు. మరీ ఇండియాలోకి కూడా అవే కలర్స్ ని తీసుకొస్తారా లేదంటే ఇంకా ఎక్కువ కలర్స్ ని తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే భారత్ లో ఈ ఫోన్ ను వైట్ లెజెండ్ ఎడిషన్, గ్రే షేడ్స్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ లో 6.82 ఇంచెస్ తో కూడిన స్క్రీన్ ను ఇవ్వనున్నారు.
4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా అందించారు.