iQOO Neo 9 Pro : మార్కెట్ లోకి రాబోతున్న ఐక్యూ నియో 9 ప్రో ఫోన్.. లాంచ్‌ డేట్‌ ఫిక్స్?

ఐక్యూ సంస్థ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. ఐకూ 12 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ని ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసిన సంస్థ ప్రస్తుతం మరో గ్యాడ్జెట్ న

Published By: HashtagU Telugu Desk
Mixcollage 16 Jan 2024 06 28 Pm 7242

Mixcollage 16 Jan 2024 06 28 Pm 7242

ఐక్యూ సంస్థ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. ఐకూ 12 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ని ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసిన సంస్థ ప్రస్తుతం మరో గ్యాడ్జెట్ ని తీసుకొచ్చే పనిలో ఉంది. దీని పేరు ఐకూ నియో 9 ప్రో. ఈ మోడల్ని వచ్చే నెల అనగా ఫిబ్రవరిలో ఇండియాలోకి తీసుకొస్తున్నట్టు ఐక్యూ తెలిపింది. ఇక ఇండియాలో లాంచ్ సిద్ధమవుతున్న ఐక్యూ నియో 9 ప్రో ఫీచర్స్ పై ఇప్పటికే కొన్ని ఊహాగానాలు కూడా బయటకి వచ్చాయి. ఇందులో 144 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన 6.78 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది.

ఇన్-స్క్రీన్ ఫింగర్ప్రింట్ స్కానర్ లభిస్తుందట. స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండొచ్చు. 12జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ వరకు ఉండే అవకాశం ఉంది. ఐకూ కొత్త స్మార్ట్ఫోన్లో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుందని తెలుస్తోంది. ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్తో కూడిన డ్యూయెల్ రేర్ కెమెరా వస్తుందని టాక్ నడుస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా రానుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్టచ్ఓఎస్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ వంటివి కూడా ఈ మోడల్లో ఉన్నాయి.

ఇకపోతే ఈ మోడల్ ధర విషయానికి వస్తే.. రూ. 35వేలు- రూ. 40వేల మధ్యలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరిలో కొత్త స్మార్ట్ఫోన్ని లాంచ్ చేస్తామని సంస్థ వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 22వ తేదీన లాంచ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

  Last Updated: 16 Jan 2024, 06:29 PM IST