iQOO Neo 9 pro: త్వరలో మార్కెట్లోకి రోబోతున్న ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ డేట్ ఫిక్స్?

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎన్నో రకాల స

  • Written By:
  • Publish Date - February 7, 2024 / 05:30 PM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన ఐకూ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది ఐకూ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఐకూ నియో 9 ప్రో పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఒకవేళ అన్ని కుదిరితే 2024, ఫిబ్రవరి 22న మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ఐకూ ప్రకటించింది. ప్రీ బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు కూడా తెలిపింది. ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ నియో 9 ప్రో ఫ్లాగ్‌షిప్-స్థాయి అద్భుతమైన పనితీరు, సున్నితమైన నైపుణ్యంతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ తో పాటు ఐకూ.కామ్ లో కూడా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. అలా ప్రీ బుక్ చేసుకుంటే రూ. 1000 వరకూ అదనపు తగ్గింపుతో పాటు రెండు సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది. అలాగే లాంచింగ్ రోజున మరిన్ని ఆఫర్లు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22 తేదీన ఇది గ్రాండ్ గా లాంచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ఐకూ నియో 9 ప్రో ప్రీ బుకింగ్స్ అమెజాన్ తో పాటు ఐకూ.కామ్ లో ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ ప్రీ బుకింగ్ స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే ఉంటుంది. మొదట బుక్ చేసుకున్న వారికి మొదటి సర్వ్ ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు రూ. 1000 మొదటి చెల్లిస్తే తర్వాత అది రీఫండ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుంది. అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 1.7 మిలియన్లకు పైగా ఉంది. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. గేమింగ్ ఔత్సాహికులకు ఈ స్మార్ట్ ఫోన్ తప్పకుండా నచ్చుతుంది. ఐకూ సొంత సూపర్‌ కంప్యూటింగ్ చిప్ క్యూ1తో అసమానమైన గేమింగ్ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. 144ఎఫ్పీఎస్ గేమింగ్, 900 పిక్సెల్ వరకు సూపర్ రిజల్యూషన్‌ను అందజేస్తుంది. ఇది సున్నితమైన, లీనమయ్యే గేమింగ్ సెషన్‌ను నిర్ధారిస్తుంది. ఐకూ నియో 9 ప్రో డ్యూయల్-టోన్ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంది. అదనంగా, స్మార్ట్‌ఫోన్‌లో స్క్విర్కిల్ కెమెరా మాడ్యూల్ 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్920 కెమెరాతో వస్తుంది.