IPTV Scams : ఫ్రీ (Free) ..ఫ్రీ (Free)..ఈ పదం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఉన్న నిత్యావసర ధరలతో సగటు మనిషి బ్రతకడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో కుటుంబ పోషణ ఎంత భారంగాఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. జీతం పావులా..ఖర్చులు రూపాయిగా మనిషి జీవన ప్రయాణం నడుస్తుంది. ఈ క్రమంలో ప్రతి చోట అప్పు తెచ్చి కుటుంబాన్ని నడుపుతూ వస్తున్నారు. దీంతో ఎక్కడ ఫ్రీ అనేది కనిపిస్తుందా..అనేది వెతకడం మొదలుపెడుతున్నారు. రాజకీయ పార్టీలు సైతం ఫ్రీ పేరు చెప్పి ఓట్లు దండుకుంటున్నాయి. పేరుకు ఫ్రీ అంటున్నారు..ఏదోక రూపంలో ప్రజల నుండి వసూళ్లు చేస్తున్నారు అనుకోండి..ఇక ఇప్పుడు కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. ఫ్రీ వినోదం అని చెప్పి..సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందులో ఐపీటీవీ (Internet Protocol television) ఒకటి.
IPTV ల ద్వారా మీ డబ్బులే కాదు మీ వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించే ప్రమాదం
యుఎస్, కెనడాలో నివసిస్తున్న ఎందరో ప్రవాస భారతీయ ప్రేక్షకులు చట్టవిరుద్దంగా టీవీ మరియు ఓటీటీ కంటెంట్ చూడటం వల్ల YuppTV, Zee5, SonyLIV, Hotstar, Netflix, Amazon, SunNXT, Aha, Colors వంటి ప్లాట్‌ఫారమ్‌లకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. కొంతమంది IPTV యాప్‌లు మరియు IPTV సెటప్ బాక్స్‌ల ద్వారా అక్రమంగా ఈ పైరేట్స్ ద్వారా కంటెంట్ ప్రసారం చేస్తున్నారు. అయితే దీనిని చాలా మంది కస్టమర్‌లు గుర్తించడం లేదు. ఈ బాక్సులను పైరేట్‌ల నుండి కొనుగోలు చేయడం మరియు వన్-టైమ్ ఫీజు చెల్లించడం ద్వారా వారు ఈ నేరస్థులకు, పైరేట్‌లకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు అవుతుంది. ఈ పైరేట్‌లు కంటెంట్ యజమానుల నుండి కంటెంట్‌ను దొంగిలించి ప్రసారం చేస్తుండడం వల్ల మీడియా మరియు వినోద పరిశ్రమలో భారీ ఆర్థిక నష్టాలు జరగడమే కాదు.. ఎంతో మంది ఉద్యోగాల పై కూడా ఆ ప్రభావం పడుతుంది. పైరేటెడ్ కంటెంట్ వీక్షకుల సంఖ్య పెరిగినట్లే .. స్కామ్ ల బారిన పడటం ఎక్కువ అవుతుంది. స్కామ్, మాల్వేర్, భద్రతా ప్రమాదాల వంటి ప్రమాదాలతో IPTV యాప్‌లు ముడిపడి ఉంటాయి. దీంతో వారు మీ ఖాతాలో డబ్బులను కొట్టేయడం..మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వంటివి చేస్తారు.
IPTV వాడడం వల్ల చట్టం దృష్టిలో మీరు నేరస్థులే..ఇందుకు గాను భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది
అంతర్జాతీయ మార్కెట్లలో Chitram TV, BOSS IPTV, Tashan IPTV, Real TV, JadooTV, World Max TV, Maxx TV, VBox, Vois IPTV, Punjabi IPTV మరియు Indian IPTV వంటి అక్రమ పైరేట్స్ ఉన్నాయి. ఈ పైరేటెడ్ బాక్స్‌ల ద్వారా చట్టవిరుద్ధంగా బాక్స్‌ల ద్వారా వీక్షించే వినియోగదారులు న్యాయస్థానం నుండి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. సబ్‌స్క్రైబర్లు ఈ పైరేట్ సేవల ద్వారా చట్టవిరుద్ధంగా వీక్షించిన ప్రతి కంటెంట్‌కు భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. ఇది వినియోగదారులకు వేల డాలర్లు చెల్లించే జరిమానాల ద్వారా ఆర్థిక కష్టాలకు దారి తీస్తుంది. యూకేలో ఇటీవల జరిగిన పైరసీ కేసులో ..పైరసీ కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా చూస్తున్న కస్టమర్‌లు నేరానికి పాల్పడుతున్నారని తేలింది.
ఇండియా, యూఎస్,కెనడా మరియు ఇతర దేశాల అందరు బాధ్యతాయుతమైన పౌరులు, వినియోగదారులు పైరసీకి మద్దతు ఇవ్వకుండా, YuppTV, Zee5 మరియు SunNXT వంటి OTTల ద్వారా చట్టబద్ధంగా కంటెంట్‌ను యాక్సెస్ పొందాలని అభ్యర్ధన. పైరేటెడ్ కంటెంట్ చూడటం వల్ల సబ్స్క్రైబర్‌లు డార్క్ వెబ్ ద్వారా పైరేట్‌ల ద్వారా సైబర్ అటాక్‌లతో నష్టాలకు గురవుతారు. ఇటీవల యూకేలో జరిగిన సంఘటనలు మరియు మే 15న France లో చట్టాలు ఆమోదించడం వల్ల పైరేటెడ్ కంటెంట్‌ను చూసే కస్టమర్‌లు ఎన్నో చిక్కులు ఎదుర్కుంటున్నారు. సో దయచేసి పైరసీ ని ప్రోత్సహించకండి..చిక్కుల్లో పడకండి అని కోరుతున్నారు.
Read Also : Pawan Suffering From Fever : జ్వరాన్ని సైతం లెక్కచేయని పవన్…ప్రజలే ముఖ్యమంటూ సమీక్షలు