Apple iPhone Price: ఇవి కదా ఆఫర్స్ అంటే.. ఈ ఐఫోన్లు చాలా చీప్ గురూ!

ఇటీవల కాలంలో మొబైల్ తయారీ సంస్థలు ఆయా స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఒక దాని నుంచి ఒకటి ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Iphone

Iphone

ఇటీవల కాలంలో మొబైల్ తయారీ సంస్థలు ఆయా స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. ఒక దాని నుంచి ఒకటి ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా యాపిల్ సంస్థ కూడా గుడ్ న్యూస్ ని తెలిపింది. భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తూ ఐఫోన్లను తక్కువ ధరలకే అందిస్తోంది. పోర్ట్‌ఫోలియోలో ఐఫోన్ల ధరలను 3 శాతం నుంచి 4 శాతం తగ్గించింది. ఆ తర్వాత కస్టమర్‌లు ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్‌ని కొనుగోలు చేస్తే రూ. 5,100 నుంచి రూ. 6వేల వరకు ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15తో సహా ఇతర ఐఫోన్‌లు కూడా రూ. 300 తగ్గుతాయని, ఐఫోన్ ఎస్ఈ మోడల్ రూ. 2300 తగ్గింపుతో వస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఆపిల్ ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. మాములుగా కొత్త జనరేషన్ ప్రో మోడల్స్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత కంపెనీ ప్రో మోడళ్లను నిలిపివేస్తుంది. అలాగే పాత ప్రో మోడల్‌ల ఇన్వెంటరీని మాత్రమే డీలర్లు, రీసెల్లర్‌లు సెలెక్టివ్ డిస్కౌంట్‌ల ద్వారా క్లియర్ చేస్తారు. ఈ నెల 23న నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024లో మొబైల్ ఫోన్‌ లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించిన తర్వాత ఆపిల్ ఈసారి ప్రో మోడల్స్ ధరలను భారీగా తగ్గించింది.

మొబైల్ ఫోన్‌ లతో పాటు, కస్టమ్స్ సుంకం కూడా తగ్గించింది ఆపిల్ సంస్థ. మొబైల్ ఫోన్‌లు, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లకు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ అవసరం పడుతుంది. ప్రస్తుతం, దేశంలో విక్రయించే దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లకు 18శాతం జీఎస్టీ, 22శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. ప్రాథమిక కస్టమ్స్ సుంకంలో 10శాతం సర్‌ ఛార్జ్ అలాగే ఉంటుంది. అదేవిధంగా తగ్గింపు తర్వాత మొత్తం కస్టమ్స్ సుంకం 16.5 శాతం. భారత మార్కెట్లో తయారైన ఫోన్‌ల విషయంలో 18శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తుంది.

  Last Updated: 27 Jul 2024, 03:32 PM IST