iPhone : ఇకపై వానలోనూ ఐఫోన్ లో ఫాస్ట్ టైపింగ్ చేయొచ్చు !!

ఐఫోన్ వినియోగదారులకు మరో కొత్త సౌకర్యం రాబోతోంది. వర్షంలోనూ నిలబడి ఐఫోన్ లో ఎంచక్కా టైప్ చేయగలిగేలా.. ఫోన్ కీ బోర్డు, స్క్రీన్, సాఫ్ట్ వేర్ లో యాపిల్ మార్పు చేయబోతోంది.

  • Written By:
  • Publish Date - July 6, 2022 / 03:56 PM IST

ఐఫోన్ వినియోగదారులకు మరో కొత్త సౌకర్యం రాబోతోంది. వర్షంలోనూ నిలబడి ఐఫోన్ లో ఎంచక్కా టైప్ చేయగలిగేలా.. ఫోన్ కీ బోర్డు, స్క్రీన్, సాఫ్ట్ వేర్ లో యాపిల్ మార్పు చేయబోతోంది. దీనికి సంబంధించిన పేటెంట్ల కోసం 2021 మార్చిలోనే యాపిల్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. నాటి నుంచే దీనికి సంబంధించిన టెక్నాలజీ అభివృద్ధి ప్రక్రియ మొదలైంది. ఐఫోన్ మోడళ్లన్నీ వాటర్ రెసిస్టెంట్ గా తయారైనవే. అయితే వర్షం పడుతుండగా.. ఐఫోన్ లో టైపింగ్ చేయడం కష్టతరంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేలా సాఫ్ట్ వేర్ ను కీబోర్డ్ లో పొందుపర్చే అవకాశం ఉంది. కీబోర్డ్ లోని అక్షరాలపై ఎక్కడైతే ఒత్తిడి ఏర్పడుతుందో అక్కడ మాత్రమే అక్షరం టైప్ అయ్యేలా చేయడమే కొత్త టెక్నాలజీ ప్రత్యేకత. నీళ్ల లోపల, వాన పడుతున్నప్పుడు కూడా ఐఫోన్ లో అదిరిపోయేలా టైపింగ్ చేయగలగడం ఫ్యూచర్ ఫీచర్ స్పెషాలిటీ. ఇందుకోసం యాపిల్ కంపెనీ రిసెర్చర్స్ వింగ్ ముమ్మర పరిశోధనలు చేస్తోంది. త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఐఫోన్ 12, 13 మోడల్స్ కు వాటర్ రెసిస్టెన్సీ ఉంది. గత మోడళ్ల కంటే ఇవి వాటర్ రెసిస్టెన్సీ చాలా మెరుగ్గా ఉంటాయని అంటున్నారు.

10 నెలల క్రితం నదిలో పడిపోయిన ఐఫోన్ కూడా..

నీళ్లలో ఫోన్ పడితే అసలు పనికిరాకుండా పోతుంది. కానీ, యాపిల్ ఐఫోన్ మాత్రం అలా కాదు.. దాదాపు 10 నెలల క్రితం నదిలో పడిపోయిన ఐఫోన్ ఇప్పుడు అదే వ్యక్తికి తిరిగి దొరికింది. ఇప్పటికీ గుడ్ కండీషన్‌లో ఉంది. ఈ ఘటన యూకేలో వెలుగు చూసింది. ఇటీవలి ఏళ్లల్లో లాంచ్ అయిన అన్ని ఐఫోన్‌లు దాదాపు IP68 రేట్ తోనే వస్తున్నాయి. ఈ ఐఫోన్లలో 1.5 మీటర్ల నీటిని కూడా 30 నిమిషాల పాటు లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేయగలవు. అయితే ఇలా అన్ని సార్లు జరగదని గుర్తించాలి.