iPhone Prices : ఐఫోన్లు అంటేనే చాలా కాస్ట్లీ. అయితే తాజాగా మనదేశంలో వాటి రేట్లు ఏకంగా 4 శాతం దాకా తగ్గాయి. దీంతో వాటి సేల్స్ గణనీయంగా పెరిగాయి. ప్రత్యేకించి రూ.5,100 వరకు రేటు తగ్గిన ఐఫోన్ ప్రో మోడల్, రూ.6వేల వరకు రేటు తగ్గిన ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్, ఇండియాలోనే తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఐఫోన్ ఎస్‌ఈ ధర సైతం రూ.2300 వరకు తగ్గింది. ఈ తగ్గింపులకు కారణం ఏమిటో తెలుసా ?
We’re now on WhatsApp. Click to Join
ఐఫోన్ల ధరల(iPhone Prices) విషయంలో యాపిల్ కంపెనీకి స్పష్టమైన పాలసీ ఉంది. దీని ప్రకారం.. కొత్త మోడళ్లు లాంఛ్ చేసినప్పుడు మాత్రమే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తుంటుంది. కానీతొలిసారిగా అలాంటి న్యూ లాంచింగ్ ఏదీ లేకున్నా.. ప్రో, ప్రో మ్యాక్స్ ఐఫోన్ మోడళ్ల ధరలను యాపిల్ కంపెనీ తగ్గించింది. ఈసారి భారత బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. సాధారణంగా విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్లపై 20 శాతం కస్టమ్స్ డ్యూటీ, 2 శాతం సర్‌ఛార్జీ (22 శాతం), 18 శాతం జీఎస్టీ విధిస్తారు. అయితే ఇప్పుడు కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. దీంతో బేసిక్ కస్టమ్ డ్యూటీ 15 శాతం, సర్‌ఛార్జీ 1.5 శాతం కలిపి 16.5 శాతానికి చేరింది. 18 శాతం జీఎస్టీ ఎలాగూ ఉంటుంది. అందుకే యాపిల్ కంపెనీ ఐఫోన్ల ధరలు ఇప్పుడు అకస్మాత్తుగా దిగి వచ్చాయి. మొత్తం మీద ఈ పరిణామం ఐఫోన్(Apple) లవర్లకు ప్లస్ పాయింట్ లాంటిది. ఎప్పటినుంచో ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారు ధర తగ్గిందని తెలిసి.. వాటిని కొనేందుకు క్యూ కడుతున్నారు.
ఈ ఫోన్ల ధరలు డౌన్
- ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ – రూ.1,54,000
- ఐఫోన్ 15 ప్రో – రూ.1,29,800
- ఐఫోన్ 15 – రూ.79,600
- ఐఫోన్ 14 – రూ.69,600
- ఐఫోన్ 13 – రూ.59,600
- ఐఫోన్ SE – రూ.47,600