Site icon HashtagU Telugu

Shock to iPhone users: ఐఫోన్ యూజర్లకు షాక్, ఈ యాప్ యూజ్ చేశారో అంతే సంగతులు…

Iphone App Yik Yak

Iphone App Yik Yak

USకు చెందిన ఓ అనామక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Yik Yak, ఐఫోన్ వినియోగదారులకు కొత్త చిక్కులను తెచ్చి పెట్టింది. ఈ ప్లాట్ ఫాం చాటింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే ఇటీవల ఈ యాప్ గురించి భయంకర వాస్తవాలు బయటపడ్డాయి. ఈ యాప్ యూజర్లలో కనీసం రెండు మిలియన్ల మంది వినియోగదారుల ఖచ్చితమైన లొకేషన్లను వారి అనుమతి లేకుండా సేకరిస్తోందని తేలింది.

కంప్యూటర్ సైన్స్ విద్యార్థి డేవిడ్ టెథర్ గత నెలలో ఐఫోన్ యాప్‌లోని లోపాల గురించి పేర్కొంటూ, ఈ Yik Yak యాప్ యూజర్ల ఖచ్చితమైన లొకేషన్, యూజర్‌ల యూనిక్ IDలను హ్యాక్ చేస్తోందని, తద్వారా యూజర్లపై సైబర్ దాడి చేసేవారికి అనుమతిస్తోందని పేర్కొంది.

Yik Yak ప్లాట్‌ఫారమ్‌లో అన్ని పోస్ట్‌లు, కామెంట్స్ ద్వారా యూజర్ల ఖచ్చితమైన GPS కోఆర్డినేట్‌లను (10-15 అడుగుల లోపు) యాక్సెస్ చేయగలిగాను, కనీసం 2 మిలియన్ల మంది వినియోగదారులను ప్రమాదంలో పడ్డారంటూ డేవిడ్ బాంబు పేల్చాడు. ఈ వినియోగదారులంతా ఆరు నెలల క్రితమే యూజర్లుగా మారారని, ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

“ఏప్రిల్ 11, 2022న Yik Yak బృందానికి తాను బయటపెట్టిన ఈ లోపాన్ని వెంటనే తెలిపినట్లు పేర్కొన్నాడు. దాదాపు ఒక నెల తర్వాత, మే 8, 2022న Yik Yak టీం స్పందించినట్లు తెలిపాడు.

Yik Yak అనేది ఒక చాటింగ్ ప్లాట్ ఫాం, దీని ద్వారా వినియోగదారులు తమ స్నేహితులు మెసేజ్ ఓపెన్ చేస్తే చాలు వారు ఎంత దూరంలో ఉన్నారో మీకు అలర్ట్ చేస్తుంది. పోస్ట్‌ను వీక్షిస్తున్నప్పుడు యాప్ వారు మీ నుండి ఎంత దూరంలో ఉన్నారో చెబుతుంది. 2013లో ప్రారంభించబడిన యాప్ గతంలో సైబర్ ఉల్లంఘనల కారణంగా మూసివేశారు. కానీ గత సంవత్సరం పునఃప్రారంభించబడింది.