Site icon HashtagU Telugu

iPhone 15 Pro Overheating: ఐఫోన్15 యూజర్ల బాధలు.. వేడెక్కుతున్న ఫోన్లు

Iphone 15 Pro Overheating

Iphone 15 Pro Overheating

iPhone 15 Pro Overheating: ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కు ఉన్న డిమాండ్ తెలిసిందే. యాపిల్ కంపెనీ తమ వినియోగదారుల్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త రకం ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సిరీస్ లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు కొన్నాంరా బాబు అనుకుంటున్నారు వినియోగదారులు. ఎందుకంటే తాజాగా రీలీజ్ చేసిన ఈ సిరీస్ ఫోన్లు వేడేక్కుతున్నాయి. ఛార్జింగ్‌ పెట్టినా, కాసేపు మాట్లాడినా, ఏదైనా గేమ్స్‌, వీడియో కాల్ ఇలా ఫోన్‌ వినియోగించినప్పుడు కాసేపటికే అవి బాగా వేడెక్కుతున్నట్లు యూజర్స్‌ కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇందులో A17 ప్రో చిప్ అమర్చడం ద్వారానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు భావిస్తున్నారు. కాగా .. వినియోగదారుల సమస్యలపై టెక్నీకల్ టీమ్ స్పందించింది. ఇంటెన్సివ్ యాప్​లను వాడుతున్నపుడు, ఛార్జింగ్ పెట్టినపుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేస్తున్నపుడు ఈ సమస్య ఎదురవుతుందని యాపిల్ తన గైడ్​లైన్స్​లో చెప్పుకొచ్చిందట.

ఐఫోన్ 15 ప్రో 128GB వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 1,34,900, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర రూ.1,59,900 (256GB). ఈ హ్యాండ్‌సెట్‌లు 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్ల ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్లోకి వచ్చిన క్షణాల్లో వినియోగదారులు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం మోడల్ లు అందుబాటులోకి తీసుకొచ్చింది సదరు సంస్థ. ఐఫోన్ 15 బేసిక్ వేరియంట్ 79,900 రూపాయలకు అందుబాటులో ఉంటే ఐఫోన్ 15 ప్రో 134,900 గా అమ్ముతున్నారు. .ధర ఎక్కువైనా సరే ఆపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఐఫోన్ ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌‌కార్ట్, బ్లింకిట్ వంటి ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా యూనికార్న్, ఇమేజిన్, ఇండియా ఐస్టోర్, విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్, టాటా క్రోమ్ వంటి స్టోర్లలో లభ్యమౌతోంది. స్టోర్‌ను బట్టి ఆఫర్లు మారుతుంటాయి.

Also Read: Virat Kohli: రాజ్‌కోట్ వన్డేలో ప్రత్యేక మైలురాయిని సాధించిన కింగ్ కోహ్లీ

Exit mobile version