iPhone 14: ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14.. ధర ఎంతో తెలుసా?

స్మార్ట్ ఫోన్ ను వినియోగించేవారు ఎన్ని రకాల ఫోన్లో ఉపయోగించినప్పటికీ లైఫ్ లో ఒకసారి అయినా కూడా ఐఫోన్ ను

  • Written By:
  • Publish Date - September 7, 2022 / 11:10 PM IST

స్మార్ట్ ఫోన్ ను వినియోగించేవారు ఎన్ని రకాల ఫోన్లో ఉపయోగించినప్పటికీ లైఫ్ లో ఒకసారి అయినా కూడా ఐఫోన్ ను ఉపయోగించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వారి పరిస్థితుల రీత్యా ఇతర కంపెనీలకు చెందిన కంపెనీ లకు చెందిన మొబైల్ లను వాడుతూ ఉంటారు. అయితే ఎందుకు ఐఫోనే ఉపయోగించాలి అనుకుంటున్నారు అంటే కొంతమంది సమాధానం చెప్పలేకపోతూ ఉంటారు. కొంతమంది అయితే మార్కెట్లో ఐఫోన్ కి ఉన్న వ్యాల్యూ గురించి చెబుతూఅటువంటి ఫోన్ ని ఉపయోగించాలి అని చెబుతూ ఉంటారు.

ఐఫోన్లు అంటే దరఖాస్తు ఎక్కువే అని చెప్పవచ్చు. ధర తో పాటుగా ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే ఈ ఈనెల ఏడవ తేదీన నిర్వహించే కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ 14 మోడల్ ను విడుదల చేయబోతోంది. అయితే ఇందులో ఒక శుభవార్త కూడా ఉంది అని చెప్పవచ్చు. అదేమిటంటే ఐఫోన్ 13 తో పోలిస్తే ఐఫోన్ 14 ధర తక్కువగానే ఉండొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ట్రెండ్‌ఫోర్స్‌ నివేదిక ప్రకారం.. ఐఫోన్‌ 14 ధర దాదాపు రూ.60,000గా ఉండవచ్చని తెలుస్తోంది. 128 జీబీ మోడల్‌ ధర 750 డాలర్లు అనగా రూ.59,600గా నిర్ణయించే అవకాశం ఉంది. అయితే ఐఫోన్‌ 13 చూస్తే 128 జీబీ మోడల్‌ ప్రారంభ ధర అప్పట్లో 799 డాలర్లుగా ఉండేది.

ఇక ఐఫోన్‌ 14 సిరీస్‌లో అయితే ఇతర ఫోన్ల ధర 850 డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా భారత్‌లో ఐఫోన్ లకు లభిస్తున్న గిరాకీలో 85 శాతాన్ని స్థానిక తయారీతో కంపెనీ అందుకుంటుంది. దేశవ్యాప్తంగా కాంట్రాక్టు తయారీ పద్ధతిలో ఐఫోన్ లను 2017 నుంచి రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఐఫోన్‌ 14 సిరీస్‌ తో భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తి సరికొత్తగా గరిష్టంగా 1.2 కోట్లకు చేరనుంది. ఇక గత ఏడాది అనగా 2021లో భారత్‌ లో ఏకంగా 70 లక్షల ఐఫోన్‌లు తయారయ్యాయి. తయారవ్వడంతో పాటుగా ఐఫోన్ల విక్రయాలు కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. భారత్లో రాను రాను ఇతర కంపెనీ ఫోన్లతో పోల్చుకుంటే యాపిల్ ఫోన్లు కూడా ఎక్కువగానే అమ్ముడు అవుతున్నాయి.