Site icon HashtagU Telugu

iPhone 14 Pro Max డిజైన్, స్పెసిఫికేషన్లపై మార్కెట్లో లీకులు..వచ్చే ఏడాది విడుదలయ్యే చాన్స్…

Iphone Imresizer

Iphone Imresizer

టెక్నాలజీ ప్రియులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కు సిద్ధం అవుతోంది. ఐఫోన్ 14 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే రానున్న ఐఫోన్ సిరీస్‌లో నాలుగు కొత్త మోడల్స్‌ను చేర్చనున్నట్లు సమాచారం అందింది, అయితే ఈసారి “మినీ” మోడల్ ఉండదని అంటున్నారు. దాని బదులుగా ఆపిల్ ఈసారి ఐఫోన్ 14 మాక్స్‌ను (iPhone 14 Pro Max)విడుదల చేయవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉంటే కొత్తగా విడుదలైన ఐఫోన్ SE సిరీస్ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ సంవత్సరం iPhone మినీ వెర్షన్ నిలిపివేస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన iPhone SE (2022)ని కొనసాగిస్తోంది. iPhone SE (2022) 64GB మోడల్‌కు ప్రారంభ ధర రూ. 43,900గా ఉంది. 256GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 58,900 వరకు లభిస్తుంది.

అధికారిక లాంచ్‌కు ముందు, ఐఫోన్ 14 మాక్స్‌తో సహా రాబోయే ఐఫోన్ మోడల్‌ల గురించి లీక్‌లు చాలా వెలువడ్డాయి. రాబోయే iPhone 14 Maxలో ఏమేం ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

ఆపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా అదే పని చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే, నివేదికల ప్రకారం, చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, లాక్ డౌన్ కారణంగా లాంచ్‌లో కొంత ఆలస్యం కావచ్చు. అయినప్పటికీ, యాపిల్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, ఐఫోన్ 14 సిరీస్‌ను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి సరఫరాదారులతో కలిసి పని చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్ (iPhone 14 Pro Max Specifications)
>> ఐఫోన్ 14 మ్యాక్స్ 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఐఫోన్ 12 లాంటి వైడ్-నాచ్‌ని కలిగి ఉంది. ప్రో మోడల్ వేరే డిజైన్ పిల్-సైజ్ నాచ్‌ని పొందవచ్చు.
>> ఐఫోన్ 14 అన్ని నాలుగు మోడల్‌లు A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయని భావిస్తున్నారు. ఇది iPhone 13 సిరీస్‌కు శక్తినిచ్చే A15 బయోనిక్ చిప్ కంటే కొంచెం ఎక్కువగా ఆప్టిమైజ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
>> ఐఫోన్ 13 లాగానే, ఐఫోన్ 14 మోడల్ కనీసం 128 GB ఇంటర్నల్ మెమరీని అందించగలదు.
>> కెమెరాల విషయం మాట్లాడుకుంటే, ఐఫోన్ 14 వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ రియర్ కెమెరాను పొందే వీలుంది. ముందు భాగంలో, ఐఫోన్ 13 వంటి ఒకే కెమెరాను పొందవచ్చు.
>> ఐఫోన్ 14 సిరీస్‌తో, ఆపిల్ పాత ఫోన్‌ల కంటే మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 సుదీర్ఘ బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై దాదాపు పూర్తి రోజు పని చేస్తుంది.