iPhone 14: త్వరలో ఇండియాలో ఐఫోన్ 14 మాక్స్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

ఈ ఏడాది చివరిలో యాపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు లంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 08:45 AM IST

ఈ ఏడాది చివరిలో యాపిల్ కంపెనీ నుంచి ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు లంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కంపెనీ 4 కొత్త మోడళ్లను తీసుకురానుంది. అయితే ఈ సారి మినీ మోడల్ ఏది ఉండదట. యాపిల్ ఈసారి ఐఫోన్ 14 మ్యాక్స్ ను విడుదల చేసే అవకాశం ఉందట. ఐఫోన్ ఎస్ ఈ సిరీస్ విక్రయాలపై ప్రభావం చూపుతున్నందున ఐఫోన్ మెనీ వెర్షన్ టెక్ దిగ్గజం ఈ సంవత్సరం విడుదల చేయదని నివేదికలు తెలుపుతున్నాయి. కంపెనీ ప్రస్తుతం ఈ సంవత్సరం ప్రారంభంలో ఐ ఫోన్ ఎస్ఈ ఫోన్ ని లాంచ్ చేసింది. SE 2022 64GB మోడల్ ప్రారంభం ధర 43,900 రూపాయలు. 256 GB స్టోరేజ్ మోడల్ ధర 58,900 రూపాయలుగా ఉంది.

ఇకపోతే ఈ ఏడాది లాంచ్ కానున్న ఐఫోన్ 14 మాక్స్ కు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతిసారి ఐఫోన్ ఫ్లాగ్ షిప్ సీరిస్ ను సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేయగా ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని భావిస్తుందట. అదేవిధంగా చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, విధించిన పరిమితుల కారణంగా లాంచ్ లో కొంత ఆలస్యం జరగవచ్చు అని నివేదికలు చెబుతున్నాయి. డిస్‌ప్లే: ఐఫోన్ 14 మాక్స్ లో మునుపటి ఐఫోన్ 12 లాగా వైడ్‌-నాచ్‌తో కూడిన 6.1-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. పిల్‌ ఆకారపు నాచ్‌ను కలిగి ఉంటాయి. ప్రాసెసర్: ఐఫోన్ 14 అన్ని నాలుగు మోడల్‌లు A16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా వస్తాయి. ఇది ఐఫోన్ 13 సిరీస్‌ను అమలు చేసే A15 బయోనిక్ చిప్‌ కంటే కొంచెం ఎక్కువగా ఆప్టిమైజ్ చేస్తుందని అనుకుంటున్నారు.

స్టోరేజ్ విషయానికి వస్తే ఐఫోన్ 13 సిరీస్ మాదిరిగానే, ఐఫోన్ 14 మోడల్‌లు కూడా కనీసం 128GB స్టోరేజ్‌ని, 512GB స్టోరేజ్ వరకు అందించే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ 14 రెండు రియర్ కెమెరా సెన్సార్‌లను, ఐఫోన్ 13 సిరీస్‌కు సమానమైన వైడ్ నాచ్ లోపల ముందు భాగంలో ఒకే సెన్సార్‌ను ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాటరీ గత సిరీస్‌లతో పోలిస్తే ఐఫోన్ 14 సిరీస్‌ మెరుగైన బ్యాటరీ పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు. ఐఫోన్ 13 మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై రోజంతా ఫోన్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంది. ఐఫోన్ 14 ప్రో మోడల్స్ డిజైన్‌ను యాపిల్ కంపెనీ మారుస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.