iPhone14: త్వరలోనే ఐఫోన్ 14 విడుదల.. ఫీచర్లు అదుర్స్!!

  • Written By:
  • Publish Date - July 30, 2022 / 06:30 AM IST

యాపిల్ ఫోన్ కొత్త మోడల్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంతటి క్రేజ్ ఉండటానికి కారణం యాపిల్ ఫోన్ కొత్త మోడల్స్ లో ఉండే స్పెసిఫికేషన్స్, ఫీచర్స్!!
యాపిల్ ఫోన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌లు సెప్టెంబర్‌ 13న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో 4 మోడల్స్ రానున్నాయి. వీటిలో రెండు ప్రామాణిక మోడల్స్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్ ఉన్నాయి. ఐఫోన్14 ప్రో, ఐఫోన్14 ప్రో మాక్స్ అనే మరో రెండు ప్రో వేరియంట్లు ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్..

* ఐఫోన్ 14లో కూడా పెద్ద స్క్రీన్ ఉంటుంది.
* ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్స్ ఫోన్లకు 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది.
* ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో మోడల్స్ 6.4 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది.
* వీటి ధర దాదాపు రూ.64,000 నుంచి రూ.71,500 వరకు ఉంటుంది.
* ఈ ఫోన్లు ప్రో మోడల్స్ అప్‌గ్రేడ్‌ కెమెరాలతో రానున్నాయి.
* ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 48 మెగా‌ఫిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది ప్రస్తుత ఐఫోన్ 13 సిరీస్‌లోని ప్రో మోడల్ కంటే 57 శాతం పెద్దది.
* 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 12 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో ఇది కలిసి ఉంటుంది.
* నాన్-ప్రో మోడల్స్‌లో 12 మెగా ఫిక్సెల్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ ఉండనున్నట్లు సమాచారం.
* మాక్స్ వేరియంట్‌లో 4325 mAh సామర్థ్యంతో, ప్రో మాక్స్ వేరియంట్‌లో 4323 mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉండనుంది.
* ఐఫోన్14, ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో వరుసగా 3279mAh, 3200mAh బ్యాటరీలను అమర్చినట్లు తెలుస్తోంది.
* వైఫై,మొబైల్‌ హాట్‌ స్పాట్‌, బ్లూటూత్‌, 5జీ నెట్‌ వర్క్‌కు ఈ మోడల్స్  సపోర్ట్‌ చేస్తాయి.

ఏ16 ప్రాసెసర్‌ తో..

ఐఫోన్‌ 14 ఫోన్లలో ఏ16 బయోనిక్‌ ప్రాసెసర్‌ ఉంటుందని అంటున్నారు. టీఎస్‌ఎంసీ 5ఎన్‌ఎంతో ఈ అడ్వాన్స్‌ వెర్షన్‌ ప్రాసెసర్‌ను తయారు చేశారు. 18 బిలియన్ నుంచి 20 బిలియన్ ట్రాన్సిస్టర్‌లతో ఇది రానుంది.   ఐఫోన్ 14 సిరీస్‌లో.. ప్రో, ప్రో మాక్స్‌ మోడల్స్‌లో ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను, ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్ వేరియంట్లలో ఏ15 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం.

గేమ్స్‌ ఆడేందుకు అనువుగా..

ఐఫోన్‌14 ఫోన్‌ కు 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. వీడియోలు చూసేందుకు, గేమ్స్‌ ఆడేందుకు అనువుగా 1170*2532 పిక్సెల్స్‌ రెజెల్యూషన్‌ ఉంది.4 జీబీ ర్యామ్‌ తో పాటు 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ సౌకర్యం ఉంది.