iPhone 14 Design Leak: ఐఫోన్ 14 ఫ్రంట్ ప్యానెల్ డిజైన్ లీక్…ఎలా ఉందంటే..!!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ గురించి గత కొంతకాలంగా ఎన్నో రూమర్స్ వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 29, 2022 / 08:57 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ గురించి గత కొంతకాలంగా ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. లైనప్ లో ఐఫోన్ 14 ప్రో ,ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్స్ మార్కెట్లోకి రానున్నట్లు లీక్ లు వచ్చాయి. కుపెర్టినో దిగ్గజం ఈ మోడల్స్ ను డెవలప్ చేసినట్లుగా ఇంకా నిర్దారించలేదు. కానీ దాని కంటే ముందుగా ఐఫోన్ 14 సిరీస్ యొక్క ఫ్రంట్ ప్యానెల్స్ కు సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. లీకైన రెండర్ టిప్ రాబోయే ఐఫోన్ మోడల్స్ పరిమాణ వ్యత్యాసాలను తెలుపుతున్నాయి. ఫ్రంట్ ఫేసింగ్, ఫేస్ ఐడీ లేవుట్స్ లీక్ అయ్యాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ రెండూ కూడా మునుపటి ఐఫోన్ జనరేషన్ కు చెందిన డిస్ ప్లే నాచ్ స్థానంలో పిల్ ఆకారపు ఓల్ పంచ్ డిస్ ప్లేతో వస్తున్నట్లు లీక్ లను బట్టి తెలుస్తోంది. అవి 19.5:9 యాస్పెక్ట్ రేషియోని కూడా కలిగి ఉంటాయని లీక్స్ ను బట్టి టెక్ నిపుణులు చెబుతున్నారు.

టిప్ స్టర్ సరన్ ఐఫోన్ 14 సిరీస్ ముందు ప్యానెల్ ను చూపిస్తూ Weibo నుంచి లీకైన ఫోటోను ట్వీట్ చేశారు. ఇమేజ్ లో ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లో పిల్ ఆకారపు ఓల్ పంచ్ కటౌట్ ను సూచిస్తుంది. ఒకవేళ లీకైన దానిబట్టి అది సరైందని తేలినట్లయితే…మునపటి ఐఫోన్ తరాలకు చెందిన డిస్ ప్లే నాచ్ నుంచి డిజైన్ మారుతుంది. డిస్ ప్లే కటౌట్ లో ఫేస్ ఐడీ సెన్సార్ తో పాటు సెల్ఫీ కెమెరా ఉంది.

ఇక లీకైన రెండర్ లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ ఈ రెండూ కూడా ఐఫోన్ 13 సిరీస్ లో చూసిన విధంగానే నాచ్ డిజైన్ తో రానుంది. ప్యానెల్ ఫోటో ప్రకారం..ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పొడవైన బిల్డ్ తో సన్నగా ఉండే బెజెల్స్ ప్యాక్ తో రానుంది. ఇక ఐఫోన్ను మీరే స్వంతగా రిపేర్ చేయడానికి యాపిల్ హెఫ్టీ టూల్ కిట్ ను తీసుకువస్తుంది. యాపిల్ నుంచి రానున్న 14ప్రో, ప్రో మ్యాక్స్ తదుపరి జనరేషన్ యాపిల్ ఏ 16 బయోనిక్ చిప్ తో వస్తుందని అంతా భావిస్తున్నారు. సాధారణంగా ఐఫోన్ 14 మోడల్స్, ఐఫోన్ 13 సిరీస్ , కొత్త ఐఫోన్ ఎస్ ఈ కి మరింత పవర్ ఇచ్చే విధంగా ప్రస్తుత జనరేషన్ ఏ 15 బయోనిక్ చిప్ లతో రానుంది.

గత లీక్ ల ప్రకారం చూసినట్లయితూ ఐఫోన్ 14 6.06 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ స్క్రీన్ తో వస్తుంది. అయితే ఐఫోన్ 14 మ్యాక్స్ 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ స్క్రీన్ను తో వస్తుందని, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 6.68అంగుళాల ఓల్ఈడీ లిప్టో స్క్రీన్ ను కలిగి ఉంటుందని పేర్కొంది.