Site icon HashtagU Telugu

Flipkart Year End Sale: ఐఫోన్ 13పై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్.. ధర, ఫీచర్స్ ఇవే?

Flipkart Year End Sale

Flipkart Year End Sale

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారి అయినా కూడా ఐఫోన్ ని ఉపయోగించాలని వాడాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి ధరల కారణంగా చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని యాపిల్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తక్కువ ధరలకు ఐఫోన్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకు వస్తోంది. అయితే కొత్త ఫోన్ కి అప్డేట్ కావాలి అనుకుంటున్నారా? ప్రస్తుతం ఐఫోన్ 13 ని తక్కువ ధరలకే చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ లో ఐఫోన్ 13 కొనుగోలు చేయవచ్చు.

మీరు ఐఫోన్ 13 ఫోన్ 128జీబీ మోడల్‌ను కేవలం రూ. 40వేలకి పొందవచ్చు. కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13ని రూ.61,999కి విక్రయిస్తోంది. ఐఫోన్ మోడల్ సాధారణ ధర కంటె రూ. 8వేలకు తగ్గింది. భారత మార్కెట్లో ఐఫోన్ 13, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర అధికారికంగా రూ.69,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ తో పాటు మరో రెండు మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 256జీబీ మోడల్ రూ. 79,900 అయితే, 512జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 99,900గా ఉండనుంది. ఈ రెండు మోడల్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఐఫోన్ 13ని సుమారు రూ. 40వేలకి పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాత ఐఫోన్ మోడల్‌ ద్వారా ఐఫోన్ 11 లేదా ఐఫోన్ XR ను ఫ్లిప్‌కార్ట్ రూ. 21,900 వరకు ఆఫర్ చేస్తుంది. మీ ఫోన్ స్క్రీన్‌లో పగుళ్లు ఉంటే ఎక్స్ఛేంజ్ వాల్యూ తగ్గించబడుతుంది. మీరు కార్ట్‌కు ఐఫోన్ 13ని యాడ్ చేయాలి. ఆపై ఎక్స్‌ఛేంజ్ ఆప్షన్ కోసం చెక్ చేయాలి. ఆపై మీరు మోడల్ పేరును యాడ్ చేయాలి. ఏదైనా డ్యామేజ్ జరిగిందో లేదో చెక్ చేసిన తరువాత వాల్యూ తెలుస్తుంది. ఫోన్ డ్యామేజ్ ఉంటే ఎక్స్ఛేంజ్ వాల్యూ తగ్గుతుంది. మీ పాత ఐఫోన్ మోడల్ నుంచి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఐఫోన్ 13ని పొందడం పూర్తిగా అర్థవంతంగా ఉంటుంది.