iPhone 11: ఐఫోన్ 11 సిరీస్ కేవలం రూ. 21 వేలకే.. ధర, ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ శాతం మంది ఐఫోన్ ను ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఐఫోన్

  • Written By:
  • Publish Date - December 6, 2022 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ శాతం మంది ఐఫోన్ ను ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఐఫోన్ ధర ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల వాటిని కొనుగోలు చేయలేక నిరాశ పడుతూ ఉంటారు. మార్కెట్లో ఐఫోన్ బ్రాండ్ కు ఎంతో క్రేజ్ ఉంది. దీని ధర ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ చాలామంది ఐఫోన్ కి సంబంధించిన ఎటువంటి న్యూ ఫోన్ మార్కెట్ లోకి విడుదల అయిన వెంటనే కొనుగోలు చేస్తూ ఉంటారు. యాపిల్‌ ఫోన్‌ ఎంత ధర ఉన్నా హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. అయితే వినియోగదారుల కోసం ఐఫోన్ సంస్థ ఎప్పటికప్పుడు అతి సరికొత్త ఫీచర్లతో అందుబాటు ధరలో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువస్తూనే ఉంది.

ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా. అటువంటి వారికి ఒక చక్కని శుభవార్త. ఐఫోన్‌ 11 మోడల్‌ మరి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై బంపర్‌ ను ఆఫర్‌ ప్రకటించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఐఫోన్‌ 11పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌ కెమెరాతో ఇతర ఫీచర్స్‌ అన్ని అద్భుతమే. ఈ ఐఫోన్‌ 11 సిరీస్‌ ఇండియాలో 2019లో రూ.64,900 ప్రారంభ ధరతో మార్కెట్ లోకి విడుదల చేసింది ఐఫోన్ సంస్థ. ఇక అప్పటి నుంచి ఈ ఫోన్స్ పెద్ద మొత్తంలో అమ్ముడుపోయాయి. ఈ సిరీస్ లో యాపిల్‌ ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 మ్యాక్స్‌ వంటి మూడు మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఆఫర్ ప్రకారం ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.21,450 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,999 ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంటే దాదాపు రూ.2,049 తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్​కింద మరో రూ.17,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో భాగంగా ఈ ఫోన్‌ కేవలం రూ.21,450కే కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఐఫోన్ 11 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌ 6.1 అంగుళాల లిక్విడ్‌ రెటినా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌ ఏ13 బయోనిక్‌ చిప్‌సెట్‌తో రన్‌ అవుతుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 12 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం కూడా 12 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 3110 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫేస్‌ఐడీ, అల్ట్రా వైడ్‌బ్యాడ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.