Powerful Shoes : మహిళలు/బాలికల భద్రత కోసం ‘పవర్’ ఫుల్ షూస్ వచ్చేశాయి. వీటిని రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా లిలీ గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ స్టూడెంట్ వివేక్ చౌదరి తయారు చేశాడు. ఈ షూస్ ధరించిన మహిళలు/బాలికల జోలికి ఎవరైతే వెళితే కరెంటు షాకులు తగలడం ఖాయం. ఎందుకంటే.. ఈ షూస్‌ను ధరించిన మహిళలు/బాలికలు ఆపదలో ఉన్నప్పుడు మడమను బలంగా నేలకు రాయగానే అసలు కథ(Powerful Shoes) మొదలైపోతుంది. వారిని తాకిన వారికి షాకుల మీద షాకులు తగులుతాయి. గరిష్ఠంగా 1000 షాకులను వరుస పెట్టి తగిలించే కెపాసిటీ ఈ షూస్‌కు ఉంది. ఈ బూట్లలో జీపీఎస్ మోడల్, ఐసీ, పవర్ మాడ్యులేటర్, వోల్టేజ్ బూస్టర్ వంటి అనేక పరికరాలు ఉన్నాయి. ఈ షూస్‌లోని ఓ డివైజ్‌కు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 1000 షాకులు కంటిన్యూగా ఇవ్వగలదు. ఇందులోనే ఉండే ఒక ప్రత్యేక ఐసీలో మూడు ఫోన్ నంబర్లను మహిళలు/బాలికలు ఫీడ్ చేయొచ్చు. ఆపదలో ఉన్నప్పుడు.. షూస్‌లోని మడమ భాగాన్ని నేలకు రాయగానే ఆ మూడు ఫోన్ నంబర్లకు మెసేజ్ వెళ్తుంది. ఆపదలో ఉన్నారనే సందేశంతో పాటు లొకేషన్ వివరాలు ఆ సందేశంలో ఉంటాయి.
Also Read :Cricketers Tax Strategy : తెలివైన పన్ను వ్యూహాలతో భారత క్రికెటర్ల తడాఖా
అందరూ నవ్వినా పట్టించుకోని వివేక్ చౌదరి
- వివేక్ చౌదరి పాలిటెక్నిక్ (ఎలక్ట్రికల్) మూడో సంవత్సరం విద్యార్థి.
- ఓ వైపు చదువుతూనే.. మరోవైపు ఒక ప్రైవేట్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
- అల్వార్ నగరంలోని మోతీ నగర్‌లో తన కుటుంబంతో వివేక్ నివసిస్తున్నాడు.
- ఏడాది క్రితం అల్వార్ జిల్లా పరిధిలో మహిళలపై పలు నేర ఘటనలు జరిగాయి. వాటి గురించి న్యూస్‌లో చూసి వివేక్ చౌదరి బాధపడ్డాడు. మహిళల భద్రత కోసం ఏదైనా చేయాలనుకున్నాడు.
- ఈవిషయాన్ని కొందరు స్నేహితులకు వివేక్ చెబితే.. వాళ్లు నవ్వి వెళ్లిపోయారు.
- దీంతో మహిళల భద్రత కోసం ప్రత్యేక షూస్ తయారీ ప్రక్రియను ఒంటరిగానే మొదలుపెట్టాడు.
- ఇంటర్నెట్, యూట్యూబ్ చూసి టెక్నికల్ వివరాలన్నీ సేకరించాడు. వాటి ఆధారంగానే మహిళల భద్రత కోసం స్పెషల్ షూస్ రెడీ చేశాడు.
- తాను తయారు చేసిన షూలకు మహిళల భద్రతా షూస్ (WSS) అని వివేక్ పేరు పెట్టాడు.
- ఈ షూస్ తయారీ కోసం వివేక్ దాదాపు రూ.3,500 ఖర్చు చేశాడు.
- త్వరలోనే ఈ బూట్లను వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జింగ్ చేసే పద్దతిని అందుబాటులోకి తెస్తానని వివేక్ చెప్పాడు.