Site icon HashtagU Telugu

Instagram New Rules : మీ వయసేంతో తెలియాలంటే సెల్ఫీ వీడియో పెట్టాల్సిందే.. ఇన్‌స్టాగ్రామ్ కొత్త నిబంధన?

Ca9a2aee 2c10 4aa0 A1ce 57e2d0f96cc5

Ca9a2aee 2c10 4aa0 A1ce 57e2d0f96cc5

తరచూ మనం ఉపయోగించే సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ యాప్ కూడా ఒకటి. ఇకపోతే యూజర్ల కోసం ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ లో ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా వయస్సుకు తగిన అనుభవాలను అందించడానికి వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి ఇంస్టాగ్రామ్ కొత్త మార్గాలను ఎంచుకుంది. రెండు కొత్తరకం ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అందులో ఎవరైనా వారి ఐడి ని అప్‌లోడ్ చేయడం. అదనంగా ఇప్పుడు సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేయాలి అంటే తప్పకుండా అందులో వయసును ధ్రువీకరించ వలసి ఉంటుందట.

అయితే ఇన్‌స్టాగ్రామ్ ఈ వయసు ద్రువీకరణ ఫీచర్ ను 2019లో ని ప్రవేశ పెట్టింది. అయితే వయస్సు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి వ్యక్తులు పుట్టిన తేదీని మాత్రమే అందించాల్సిన అవసరం ఉన్నందున సిస్టమ్ పనికిరాదని ఆ తర్వాత, సిస్టమ్ తప్పనిసరి, కానీ ప్లాట్‌ఫారమ్ వినియోగదారు వయస్సు గురించి గట్టి నిర్ధారణను పొందడంకోసం డ్రైవింగ్ లైసెన్స్ లేదా గుర్తింపు కార్డు వంటి అధికారిక గుర్తింపు కార్డులను అప్‌లోడ్ చేయడం ద్వారా ఒకరు వారి వయస్సును ధృవీకరించవలసి ఉంటుందట. ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌ లో 18 నుండి 18 ఏళ్లలోపు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారి పుట్టిన తేదీని ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తే, వారి IDని అప్‌లోడ్ చేయడం, వీడియో సెల్ఫీని రికార్డ్ చేయడం లేదా పరస స్నేహితులను అడగడం..

మూడు ఎంపికలలో ఒకదానిని ఉపయోగించి వారి వయస్సును ధృవీకరించవలసి ఉంటుంది. వారి వయస్సును వెరిఫికేషన్ అని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో షేర్ చేసింది. అయితే మూడు ఎంపికలలో మొదటిది మీ అధికారిక ఐడి లలో దేనినైనా అప్‌లోడ్ చేయడం. రెండవది సోషల్ బోనస్, ఇక మూడవది ఇన్‌స్టాగ్రామ్ మీ వయసు నిర్ధారించడానికి మీరు మీ పరస్పర అనుచరులను అడగాలి. అయితే ఈ ఫీచర్ ను 13 ఏళ్లలోపు పిల్లలలో 40 శాతం కంటే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారని వారిని మినహాయించడం కోసం ఆ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.