Instagram: ఇన్​స్టాగ్రామ్​లో నోట్స్​ ఫీచర్​.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అత్యధిక మంది ఉపయోగించే యాప్ లలో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి. నిత్యం లక్షలాది

  • Written By:
  • Updated On - September 30, 2022 / 07:13 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు అత్యధిక మంది ఉపయోగించే యాప్ లలో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి. నిత్యం లక్షలాది ముంది వినియోగదారులు ఈ ఇంస్టాగ్రామ్ యాప్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇక వినియోగదారుల కోసం ఇంస్టాగ్రామ్ సంస్థ వారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ లను తీసుకు వస్తూనే ఉన్నారు. కాగా ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంస్టాగ్రామ్ సంస్థ వారు నోట్స్ అనే ఒక సరికొత్త ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు.

ఇకపై ఇంస్టాగ్రామ్ యూజర్స్ నోట్స్ తో తమకు నచ్చింది రాసి ఇతరులతో పంచుకోవచ్చు. అయితే తాజాగా తీసుకువచ్చిన ఈ ఇంస్టాగ్రామ్ నోట్స్ ఫీచర్ అన్నది స్టేటస్ మాదిరిగానే ఉంటుంది. స్టేటస్ అనేది న్యూస్ ఫీడ్ లో కనిపిస్తే నోట్స్ మాత్రం డీఎం లో ఉంటుంది. మనం రాసిన నోట్స్ 24 గంటల తర్వాత డిలీట్ అయిపోతుంది. అంతే కాకుండా ఈ నోట్స్​ ఫీచర్​కు 60 క్యారెక్టర్​ లిమిట్​ కూడా ఉంది. కాగా తాజాగా తీసుకువచ్చిన ఈ ఫీచర్ కు యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ఇకపోతే ఈ ఇంస్టాగ్రామ్ నోట్స్ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా మీ ఇన్​స్టాగ్రామ్​ యాప్​ని అప్డేట్​ చేసి ఇన్​స్టాగ్రామ్​ యాప్​ని ఓపెన్​ చేయండి. ఆ తరువాత డీఎం సెక్షన్​ లోకి వెళ్లండి. తరువాత పైన కనిపిస్తున్న యువర్​ నోట్​ అనే ఆప్షన్ పై క్లిక్​ చేయండి. అప్పుడు మీరు ఏం టైప్ చేయాలి అనుకుంటున్నాది అక్కడ టైప్ చేయండి. అనంతరం ఫాలోవర్స్​, క్లోజ్​ ఫ్రెండ్స్​ ఎవరికి మీ నోట్స్ కనిపిచాలి అన్నది సెలక్ట్​ చేసుకోండి. ఇక చివరగా షేర్​ బటన్​ ప్రెస్​ చేస్తే మీ నోట్స్​ షేర్​ అవుతుంది.