Instagram: ఇన్‌స్టా స్టేటస్‌పై లిమిట్.. ఇకపై కనిపించేది మూడే

ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ అప్‌డేట్ రాబోతోంది. ముఖ్యంగా స్టేటస్‌లలో కొత్త ఛేంజెస్ రాబోతున్నాయి. యూజర్లకు మరింత ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ ఇచ్చేందుకు త్వరలోనే స్టేటస్ లేఔట్ మార్చబోతోంది.

  • Written By:
  • Publish Date - May 21, 2022 / 12:35 PM IST

ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ అప్‌డేట్ రాబోతోంది. ముఖ్యంగా స్టేటస్‌లలో కొత్త ఛేంజెస్ రాబోతున్నాయి. యూజర్లకు మరింత ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ ఇచ్చేందుకు త్వరలోనే స్టేటస్ లేఔట్ మార్చబోతోంది. ఇన్‌స్టాలో మార్పులపై సంస్థ అధికారికంగా చెప్పకపోయినా.. బ్రెజిల్‌లో మాత్రం కొత్త వెర్షన్ నడుస్తోంది. ఆ అప్‌డేట్స్‌ను క్యాప్చర్ చేసిన టెక్ ఎక్స్‌పర్ట్స్.. త్వరలో ఇన్‌స్టాలో వచ్చే మార్పులేంటో చెబుతున్నారు. వాట్సప్‌లో ఉన్నట్టే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా స్టేటస్‌లు పెట్టుకోవచ్చు. ఒక విధంగా ఇది లిమిట్‌లెస్. వంద స్టేటస్‌లైనా పెట్టుకోవచ్చు. ఈ లుక్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఏమంత బాగోలేదన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. పైగా రైలు పెట్టేల్లా ఒకదాని పక్కన ఒకటి ఉండేసరికి
యూజర్లు పెద్దగా స్టేటస్‌లను చూడడం లేదు. దీన్ని మార్చాలని భావించిన సంస్థ.. ఇకపై స్టేటస్‌లలో లిమిట్ పెట్టింది. కొత్త వెర్షన్‌లో కేవలం మూడు స్టేటస్‌లు మాత్రమే పైకి కనిపిస్తాయి.

కేవలం మూడు స్టేటస్‌లేనా అని ఫీల్ అవ్వక్కర్లేదు. దీని పక్కనే షో ఆల్ అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. క్రియేటర్ల స్టేటస్ చూడాలనుకునే వాళ్లు షో ఆల్ ఆప్షన్‌పై టచ్ చేస్తే చాలు.. అన్ని స్టేటస్‌లు కనిపిస్తాయి. కాకపోతే ఇందులో ఉన్న సౌలభ్యం ఏంటంటే, క్రియేటర్ తను పెట్టిన స్టేటస్‌లలో ఏది ఇంపార్టెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మూడు స్టేటస్‌లకు ఇన్‌స్టా అవకాశం ఇస్తోంది. అంటే.. స్టేటస్‌లో సెలక్ట్ చేసిన ఆ మూడు మాత్రమే కనిపిస్తాయి. మిగతావి హిడెన్‌లో ఉంటాయి. దీనివల్ల స్టేటస్ ఫీచర్‌కు క్రేజ్ పెరుగుతుందన్నది ఇన్‌స్టా ఆలోచన. పైగా ఈ కొత్త మార్పులతో స్పామ్ కంటెంట్ కూడా కంట్రోల్ అవుతుందని సంస్థ చెబుతోంది. అతి త్వరలో రాబోయే లేటెస్ట్
వెర్షన్ కోసం ఇన్‌స్టా లవర్స్ వెయిట్ చేస్తున్నారు. చూడాలి.. ఈ కొత్త ఫీచర్ సక్సెస్ అవుద్దో లేదో.