Site icon HashtagU Telugu

Instagram: ఇంస్టాగ్రామ్ లో మరో సరికొత్త ఫీచర్.. ఇకపై వారికీ ఇక పండగే?

Instagram

Instagram

ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఇంస్టాగ్రామ్ సంస్థ కూడా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే ఇంస్టాగ్రామ్ సంస్థ వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. సామాన్యూల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ వినియోగిస్తుండడంతో ఇంస్టాగ్రామ్ సంస్థ కూడా అందుకు అనుగుణంగానే అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తోంది.

ఇకపోతే ఇంస్టాగ్రామ్ కు అంతటి క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న ఫీచర్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త అప్డేట్ ని తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో కేవలం 10 ఫొటోలు, లేదా వీడియోలు మాత్రమే అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు తమ అకౌంట్‌లో సింగిల ఫోస్ట్‌ లో ఏకంగా 20 ఫొటోలు లేదా వీడియోలను షేర్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

దీంతో ఒకే పోస్ట్‌లో ఎక్కువ ఫొటోలు షేర్‌ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ గా చెప్పవచ్చు. ఒక పోస్టులు ఎక్కువ పోస్టులు చేసుకోవాలి అనుకుంటున్నా వారికి నిజంగా ఇది ఒక చక్కటి శుభవార్తనే చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ సహాయంతో క్రియేటివిటీతో రిచ్‌ కంటెంట్‌ను షేర్‌ చేసేందుకు మంచి అవకాశం లభించనుంది. అయితే ఇలా ఫొటోలను ఒకే పోస్ట్‌లో షేర్‌ చేయడం ద్వారా యూజర్లకు విసుగు వచ్చే అవకాశం ఉంటుందననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫొటోలను ఎక్కువగా షేర్‌ చేయడం వల్ల ఫాలోవర్స్‌ గందరగోళానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి ఇన్‌స్టాగ్రామ్‌ లో తీసుకొస్తున్న ఈ అప్‌డేట్‌ యూజర్లను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి మరి.