Site icon HashtagU Telugu

Instagram: ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారా.. అయితే ఈ అదిరిపోయే ఫీచర్ మీకోసమే!

Mixcollage 19 Jul 2024 01 11 Pm 4723

Mixcollage 19 Jul 2024 01 11 Pm 4723

ఇంస్టాగ్రామ్.. సామాన్యుల నుంచి ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో ఈ యాప్ కూడా ఒకటి. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది తప్పకుండా ఇంస్టాగ్రామ్ ని వినియోగిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ వాడకం పెరిగిపోవడంతో పాటు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ సంస్థ కూడా అందుకు అనుగుణంగానే కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.

అందులో భాగంగానే ఇప్పటికే చాలా రకాల ఫీచర్లను పరిచయం చేసిన ఇంస్టాగ్రామ్ సంస్థ తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా పాపులర్‌ అయిన ఫీచర్స్‌లో రీల్స్‌ ఒకటి. వీటి ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ రీల్స్‌ లో సరికొత్త ఫీచర్‌ను యాడ్‌ చేసింది ఇంస్టాగ్రామ్ సంస్థ. ప్రస్తుతం రీల్స్‌లో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆడియో ట్రాక్‌ లను యాడ్‌ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ తో రీల్స్‌ లో ఒకటి కంటే ఎక్కువ ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసే అవకాశాన్ని కల్పించారు.

దీంతో యూజర్లు తమ రీల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్‌ లను యాడ్‌ చేసుకోవచ్చు. దీంతో రీల్స్‌ అనుభూతి కూడా మరింత మెరుగవుతుందని కంపెనీ చెబుతోంది. మల్టీ ట్రాక్‌ రీల్స్‌ ఫీచర్‌ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇకప రీల్‌ లో 20 వరకు ఆడియో ట్రాక్‌ లను యాడ్‌ చేసుకోవచ్చు. దీంతో మీ కంటెంట్‌ ను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే ఈ రీల్స్‌ లో మీ ఆడియోను టెక్ట్స్‌, స్టిక్కర్‌, క్లిప్స్‌ కు అనుగుణంగా సెలక్ట్‌ చేసుకోవచ్చు. దీంతో అప్పటికే ఉన్న డిఫాల్ట్‌ ఆడియో ట్రాక్స్‌ మాత్రమే కాకుండా మీరే స్వయంగా ఒక ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆడియోను నచ్చిన వారు దాన్ని సేవ్‌ చేసుకొని వాడుకునే అవకాశం లభిస్తుందట. అయితే ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ అధిపతి ఆడమ్‌ మొస్సేరీ వెల్లడించారు. అయితే ఇలా ప్రత్యేకంగా సృష్టించిన ఆడియో ట్రాక్‌లను వారి పేరు మీదే లేబుల్‌ చేస్తామని వారికి క్రెడిట్‌ ఇస్తామని తెలిపారు ఇక ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయానికి వస్తే.. యాప్‌లో వీడియో ఎడిటర్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేయాలి. యాడ్‌ టు మిక్స్‌ పై ట్యాప్‌ చేసి కావాల్సిన ట్రాక్‌ లను ఎంచుకోవాలి. ఒక ఆడియోలో కావాల్సిన భాగాన్ని కూడా ఎంపిక చేసుకొనే వీలు ఉంటుంది.