Site icon HashtagU Telugu

Instagram: ఇంస్టాలో మరో అద్భుతమైన ఫీచర్.. ఆ కార్డ్ తో ఈజీగా ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చట!

Instagram

Instagram

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దాంతో వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవడం కోసం ఇంస్టాగ్రామ్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త అప్డేట్ ను ప్రవేశపెడుతోంది ఇంస్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం ప్రొఫైల్ కార్డ్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ప్రొఫైల్ కార్డ్ ద్వారా మీ ప్రొఫైల్‌ ను ఎక్కువ మందితో షేర్ చేయవచ్చట. తర్వాత మీరు మీ యూజర్ నేమ్ షేర్ చేయడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అయితే వాస్తవానికి, ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒకే పేరుతో చాలాసార్లు అనేక ప్రొఫైల్‌ లు క్రియేట్ అవుతుంటాయి. ఈ కార్డ్ ద్వారా ఫాలోవర్లు మిమ్మల్ని మాత్రమే ఫాలో అయ్యేందుకు వీలు ఉంటుంది. ఈ ప్రొఫైల్ కార్డ్‌ లో క్యూర్ కోడ్ కూడా ఉంది. స్కాన్ చేయడం ద్వారా ప్రొఫైల్ నేరుగా ఓపెన్ చేసి ఫాలో చేయవచ్చట. మరీ ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కార్డ్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికొస్తే.. మీ ప్రొఫైల్‌ కార్డుతో అకౌంట్ ప్రొఫైల్ మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చట. ఇది రెండు వైపుల డిజిటల్ కార్డ్‌ మాదిరిగా ఉంటుంది. మీ బయో, ఇతర పేజీలకు లింక్‌ లు, మీకు ఇష్టమైన పాట వంటి వాటిని పెట్టుకోవచ్చట. అంతేకాదు మీ కార్డ్‌ ని కస్టమైజ్ చేసుకోవచ్చట. బ్యాక్‌గ్రౌండ్ కూడా మార్చవచ్చని చెబుతున్నారు.

అలాగే సెల్ఫీలను కూడా అప్‌లోడ్ చేయవచ్చట. కస్టమైజడ్ ఎమోజీలను కూడా యాడ్ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ప్రొఫైల్ కార్డును ఎలా షేర్ చేయాలి అన్న విషయానికొస్తే.. మీ ప్రొఫైల్ కార్డ్‌ను షేర్ చేయడానికి మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ కు వెళ్లి, మీకు షేర్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ప్రొఫైల్ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి. ప్రొఫైల్ కార్డ్‌ లో వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన వివరాలను ఎడిట్ చేయవచ్చు. తర్వాత మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కార్డ్‌ని స్టోరీలో షేర్ చేయవచ్చు. ఇతర సోషల్ నెట్‌వర్క్‌ లలో కూడా షేర్ చేయవచ్చు. మీకు కావాలంటే, మీరు దీన్ని వాట్సాప్ గ్రూపులతో పాటు ఇతర స్నేహితులకు కూడా షేర్ చేయవచ్చుట.