Site icon HashtagU Telugu

Instagram Location Feature: ఇంస్టాగ్రామ్ లో వాట్సాప్ మాదిరి ఫీచర్.. ఇకపై ఆ పని మరింత సులువు!

Instagram

Instagram

ప్రముఖ మెసేజింగ్ యాప్ ఇంస్టాగ్రామ్ సంస్థ వినియోదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే విడుదల చేసిన వాటికి అప్డేట్ లను విడుదల చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ లైవ్ లొకేషన్‌ ను ఒక గంట పాటు షేర్ చేయడం లేదా మ్యాప్‌ లో తమ లొకేషన్‌ ను పిన్ చేసేందుకు అనుమతిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ లో లొకేటింగ్ షేరింగ్ ఫీచర్‌ ను అందిస్తుందట. వినియోగదారులు తమ లైవ్ లొకేషన్‌ ను ఒక గంట వరకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. అంతేకాదు.రాక సమయాలను కోఆర్డినేట్ చేయడం లేదా కచేరీలు లేదా క్రికెట్ మ్యాచ్‌ లు వంటి రద్దీ ప్రదేశాలలో మీ స్నేహితుల లొకేషన్ గుర్తించేందుకు మ్యాప్‌ లో ఒక లొకేషన్ పిన్ చేయడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందట. ముఖ్యంగా లైవ్ లొకేషన్ ఫీచర్ డిఫాల్ట్‌ గా ఆఫ్ అవుతుంది. డైరెక్ట్ మెసేజ్‌ లో ప్రైవేట్‌ గా మాత్రమే షేర్ అవుతుంది.

షేరింగ్ లొకేషన్ చాట్‌ లోని రెండు పార్టీలకు కనిపిస్తుంది. మరెవరికీ ఫార్వార్డ్ చేయడం కుదరదు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లొకేషన్ షేరింగ్ ప్రోగ్రెస్‌ లో ఉందని సూచించే చాట్ ఎగువన ఒక ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. అయితే వినియోగదారులు తమకు నచ్చిన సమయంలో లొకేషన్ షేరింగ్‌ ను ఎండ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మెటా యాజమాన్యం లోని సోషల్ మీడియా దిగ్గజం లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ లు ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.