Instagram Edit Message: ఇంస్టాగ్రామ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై మెసేజ్ ఎడిట్ చేయచ్చట?

ప్రస్తుత రోజుల్లో ఇంస్టాగ్రామ్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఈ ఇంస్టాగ్రామ్ వినియోగిస్తున్నారు. అలా

  • Written By:
  • Publish Date - February 4, 2024 / 04:00 PM IST

ప్రస్తుత రోజుల్లో ఇంస్టాగ్రామ్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఈ ఇంస్టాగ్రామ్ వినియోగిస్తున్నారు. అలా రోజు రోజుకి ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇంస్టాగ్రామ్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఇలా ఒక వైపు ఇన్స్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండగా మరోవైపు ఇంస్టాగ్రామ్ సంస్థ ఆ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంస్టాగ్రామ్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏది? ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అన్న వివరాల్లోకి ళితే.. ప్రస్తుతం మనకు వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ ఇతరులకు పంపితే అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే ఎడిట్ చేసుకునే ఆప్షను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ఇలాంటి ఫీచర్ ని తీసుకువచ్చింది. ఇతరులకు మెసేజ్ ను పంపిన తర్వాత ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ మెసేజ్ ను ఎడిట్ చేసి మళ్లీ పంపించవచ్చు.. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు పంపిన మెసేజ్ ని కేవలం 15 నిమిషాల లోపు మాత్రమే ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎడిట్ చేయడం కుదరదని గమనించాలి.

అదేవిధంగా, కొత్తగా పంపిన మెసేజ్ మాదిరిగా ఈ ఎడిటెడ్ మెసేజ్ కనిపించదు. మీరు ఎడిట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ మీకు ఎడిటెడ్ అనే లేబుల్‌తో కనిపిస్తుంటుంది. అంటే ఈ మెసేజ్ పంపిన వ్యక్తి ఎడిట్ చేశారు అనే విషయం అందుకున్న వ్యక్తికి కూడా తెలుస్తుంది. మరి మెసేజ్ ఎలా ఎడిట్ చేయాలి అన్న విషయానికి వస్తే.. మొదట ఇంస్టాగ్రామ్ యాప్ ను ఓపెన్ చేసి మీకు కన్వర్జేషన్ నావిగేట్ చేయాలి. అలాగే లేటెస్ట్ గా పంపిన మెసేజ్ ఎంచుకోవాలి. కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయగా అప్పుడు పైన మనకు ఆప్షన్లలో ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీ మెసేజ్ రీవైజ్ టెక్స్ట్ ఎడిట్ చేయండి. కొత్త మార్పుల తర్వాత చాట్‌లో మీ మెసేజ్ అప్‌డేట్ చేసేందుకు సెండ్ నొక్కండి. మెసేజ్ ఎడిట్ చేసిన తర్వాత చాట్‌లో మీ ఎడిట్ చేసిన మెసేజ్ పైన Edited అని కనిపిస్తుంది. ఇతరులు చాట్‌లో లేదా నోటిఫికేషన్ నుంచి వచ్చిన మెసేజ్ ఎడిట్ చేసే ముందే చదివి ఉండవచ్చు. చదవని నోటిఫికేషన్‌లు మీ ఎడిట్ చేసిన మెసేజ్‌తో రిప్లేస్ అవుతాయి. మీరు ఎడిట్ చేసిన మెసేజ్ రిపోర్టు చేసినట్టుయితే ఎడిట్ హిస్టరీ రిపోర్టులో యాడ్ అవుతుంది. మీరు ప్రస్తావనలు లేదా ఆదేశాలను కలిగిన మెసేజ్‌లను ఎడిట్ చేయలేరు. కానీ మీరు వాటినిఅన్ సెండ్ చేయవచ్చు. మీరు పంపే ప్రతి సందేశాన్ని ఐదు సార్లు వరకు సవరించవచ్చు.