ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ ఇన్ఫినిక్స్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మరొక నూతన స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9ను మలేషియాలో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియాలో విడుదలైన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8కు ఇది సక్సెసర్ గా పని చేస్తుంది. సరసమైన ధరలో నమ్మదగిన పర్ఫార్మెన్స్, సూపర్ ఫీచర్స్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 మంచి ఆప్షన్‌గా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇకపోతే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9లో 6.7 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90.2 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ81 ప్రాసెసర్ ఉంది. ఇది దాని మునుపటి హీలియో జీ36 నుంచి గణనీయమైన అప్‌గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఈ మార్పు స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ని మెరుగు పరుస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ సమయంలో గ్యాడ్జెట్ సజావుగా పని చేయాలనుకునే వినియోగదారులకు సేవలు అందిస్తుంది. 3 జీబీ లేదా 4 జీబీ ర్యామ్, 64 జీబీ లేదా 128 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లతో పాటు 4 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 ఆండ్రాయిడ్ 14 పై ఇన్ఫినిక్స్ ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో పని చేస్తుంది.
ఇది సహజమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. ఇన్ఫినిక్స్ డ్యూయెల్ కెమెరా సిస్టమ్‌తో డివైజ్‌ని రెడీ చేస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇది 10వాట్ స్టాండర్డ్ ఛార్జింగ్‌కి మద్దతు ఇస్తుంది. రోజువారీ ఉపయోగం కోసం తగినంత పవర్‌ని అందిస్తుంది. ఇకపోతే డిజైన్ పరంగా, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్‌ని అందిస్తుంది. మెటాలిక్ బ్లాక్, నియో టైటానియం, మింట్ గ్రీన్, శాండ్ స్టోన్ గోల్డ్ వంటి నాలుగు కలర్స్ లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయెల్ స్టీరియో స్పీకర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, బూస్ట్ ఇంజిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ తన అధికారిక వెబ్సైట్లో స్మార్ట్ 9 ను లిస్ట్ చేసింది. అయితే కొనుగోలు లింక్ ఇంకా లైవ్ అవ్వలేదు. మలేషియాలో 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.6,300గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గురించి వివరాలు అందుబాటులో లేవు.