Site icon HashtagU Telugu

Infinix Smart 8: భారత్ లోకి మరో ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

Mixcollage 15 Jan 2024 06 24 Pm 9825

Mixcollage 15 Jan 2024 06 24 Pm 9825

హాంగ్‌కాంగ్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫినిక్స్‌ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. తాజాగా భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 అనే స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. గత ఏడాది నవంబర్‌లో నైజీరియా మార్కెట్‌లోకి ప్రవేశించిన ఈ ఫోన్‌ తాజాగా భారత యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికొస్తే.. ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 భారత్‌లో 4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 15 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి. లాంఛ్‌ ఆఫర్‌ కింద దీన్ని రూ.6,749కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు గెలాక్సీ వైట్‌, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్‌, టింబర్‌ బ్లాక్‌ వంటి కలర్స్ లభించనుంది. 90Hz రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న 6.6 అంగుళాల హెచ్‌డీ+ తెరను ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 ఈ ఫోన్‌లో అమర్చారు. 12 ఎన్‌ఎం ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌ను ఇస్తున్నారు.

4జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 8జీబీ వరకు విస్తరించుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డ్‌తో 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 13 గో ఎడిషన్‌ ఆధారిత ఎక్స్‌ఓఎస్‌13 ఓఎస్‌ను ఇచ్చారు. ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 8 లో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాను పొందుపర్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్‌ కెమెరా ఇచ్చారు. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్‌ 5.0, జీపీఎస్‌, GLONASS, యూఎస్‌బీ టైప్‌-సి వంటి ఫీచర్లు ఉన్నాయి. పక్క భాగంలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

Exit mobile version