Infinix Note 40S 4G Launch: త్వరలోనే మార్కెట్ లోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్.. లాంచింగ్ డేట్ ఫిక్స్?

హాంగ్‌కాంగ్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తె

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 09:29 AM IST

హాంగ్‌కాంగ్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫినిక్స్‌ సంస్థ త్వరలో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. మరి ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్లు, లాంచింగ్ డేట్ ఇలాంటి వివరాల్లోకి వెళితే.. భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 4జీ ఫోన్ వచ్చేస్తోంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీ పేరుతో కంపెనీ రాబోయే వారాల్లో లాంచ్ చేయనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, డిజైన్ వివరాలను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. త్వరలో రాబోతున్న ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీ డిజైన్ గత మార్చిలో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ, నోట్ 40ప్రో 5జీ సిరీస్‌ల మాదిరిగానే ఉంటుందని కంపెనీ వెబ్‌సైట్ తెలిపింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఛార్జింగ్ లెవెల్‌లు, నోటిఫికేషన్‌ల గురించి యూజర్లకు తెలియజేసే హాలో ఏఐ లైటింగ్ రింగ్‌తో పాటు బ్యాక్ కెమెరాలను కలిగిన ఎత్తైన మెటాలిక్ ఐలాండ్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీ అబ్సిడియన్ బ్లాక్, వింటేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని వెబ్‌సైట్ ధృవీకరిస్తుంది. అయితే, స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ లేదా ధర గురించి ఎలాంటి సమాచారం లేదు. మరి ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీ 3డీ కర్వ్డ్ 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ 1,080×2,436 పిక్సెల్‌లు ఎల్‌‌టీపీఎస్ అమోల్డ్ స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటుంది.

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వెర్షన్‌ను కూడా అందిస్తుంది. స్టాండర్డ్ నోట్ 40 మోడల్ మాదిరిగానే ఈ హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ నుంచి 6ఎన్ఎమ్ హెలియో జీ99 అల్టిమేట్ చిప్‌సెట్ అందిస్తుంది. 8జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీ కూడా కంపెనీ ఎక్స్ఓఎస్ 14 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. రెండు ఏళ్ల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, మూడు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకోనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీలో కేవలం రెండు బ్యాక్ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. ఇతర నోట్ 40 మోడల్‌ల మాదిరిగా కాకుండా ప్రాథమిక కెమెరాలో 108ఎంపీ సెన్సార్ ఉంది. 2ఎంపీ మాక్రో కెమెరాతో పాటుగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 5, బ్లూటూత్, 4జీ ఎల్‌టీఈ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎస్ 4జీ 33డబ్ల్యూ అడాప్టర్‌తో ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ మ్యాగ్‌కిట్ టెక్నాలజీ ద్వారా 20డబ్ల్యూ వద్ద వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.