Site icon HashtagU Telugu

Infinix Zero Flip: బడ్జెట్ ధరలోనే ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ మరో స్మార్ట్ ఫోన్!

Infinix Zero Flip

Infinix Zero Flip

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ భారత మార్కెట్లోకి ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన ఇన్‌ఫినిక్స్‌ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతోంది. అది కూడా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. అక్టోబర్‌ 17వ తేదీన మార్కెట్‌ లోకి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతున్నారు.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 3.64 ఇంచెస్‌ తో కూడిన కవర్‌ స్క్రీన్‌ను అందిస్తున్నారు. అలాగే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.9 ఇంచెస్‌ ప్రైమరీ డిస్‌ప్లేను కూడా అందించారు. ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాను కూడా అందిస్తున్నారు. ఇక సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి 32ఎంపీ తో కూడిన ఫ్రంట్‌ కెమెరా ఇచ్చే అవకాశాలు ఉన్నాయట.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 70 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4270 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బ్లోసమ్‌ గ్లో, రాక్‌ బ్లాక్‌ కలర్స్‌లో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ధర విషయానికొస్తే.. ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ స్మార్ట్‌ ఫోన్‌ ధర గ్లోబల్ మార్కెట్లో 600 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. అంటే మన భారత కరెన్సీలో ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 50 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌ 17వ తేదీన ఈ ఫోన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.