Site icon HashtagU Telugu

Infinix Note 30 5G: కేవలం రూ.20 వేలకే అద్భుతమైన కెమెరా కలిగిన ఇన్ఫినిక్స్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Infinix Note 30 5g

Infinix Note 30 5g

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా సరికొత్త ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా భారత మార్కెట్లోకి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ని తీసుకురాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఇన్‌ఫినిక్స్‌ సంస్థ త్వరలోనే నోట్‌ 30 పేరుతో ఈ 5జీ ఫోన్‌ ను తక్కువ ధరకే అందించనుంది.

విడుదల తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు. కాగా త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్న ఇన్ఫినిక్స్ నోట్ 30 స్మార్ట్ ఫోన్ ధర రూ.20,990 గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. నోట్ 30 5జీ ఫోన్‌ మీడియాటెక్‌ డైమన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేయనుంది. ఇందులో 6.78 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించనున్నారు.

అలాగే ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్స్‌ తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకురానున్నారు. అయితే ఈ ఫోన్ లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.

Exit mobile version