Site icon HashtagU Telugu

Infinix Note 40: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్ ఫోన్?

Mixcollage 15 Jun 2024 05 35 Pm 1222

Mixcollage 15 Jun 2024 05 35 Pm 1222

హాంగ్‌కాంగ్‌ కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫినిక్స్‌ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేయబోతోంది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లోనే తీసుకొచ్చారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇందులో 93.8 శాతం స్క్రీన్‌ టూ రేషియోను అందించారు. అలాగే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్ విత్ స్లైట్‌లీ రైజ్డ్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్‌ను ఇచ్చారు. ఇకపోతే కెమెరా క్లారిటీ విషయానికొస్తే.. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే…ఈ ఫోన్‌లో 33వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ మ్యాగ్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. జేబీఎల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన సౌండ్ సిస్టమ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఇమ్మర్సిన్‌ ఆడియో సిస్టమ్‌, 360 డిగ్రీ సిమ్మెట్రికల్ సౌండ్, బూస్టెడ్ బాస్ కలిగి ఉంటుందని సమాచారం. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మీడియా టెక్‌ డైమెన్సిటీ 7020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Exit mobile version