Infinix Note 30 VIP: మార్కెట్ లోకి ఇన్ఫినిక్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకీ ఇన

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 07:30 PM IST

ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకీ ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆ కంపెనీ కూడా అతి తక్కువ ధరకే మంచి మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా మార్కెట్లోకి నోట్‌ 30 వీఐపీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. జూన్‌ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ నీ తక్కువ బడ్జెట్‌ తో మంచి మంచి ఫీచర్ లను అందించారు. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ ఫోన్‌ను 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌ లో తీసుకొచ్చారు. అలాగే ఈ ఫోన్ మనకు గ్లేసియర్ వైట్, మ్యాజిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ ఫోన్‌ ప్రారంభ ధర విషయానికి వస్తే.. దీని ధర రూ. 24,600గా ఉంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 2,400 x 1,080 పిక్సెల్స్‌తో కూడిన 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఆండ్రాయిడ్‌ 13, ఎక్స్‌ఓఎస్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్‌ను అందించారు. కాగా ఇందులో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కాగా బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 68 వాట్స్‌ వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది.. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.