Electric Bike: మార్కెట్ లోకి తొలి ఎలక్ట్రిక్ గేర్ల బైక్.. ఫీచర్లు ఇవే?

ఈ మధ్యకాలంలో వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై

Published By: HashtagU Telugu Desk
Electric Bike

Electric Bike

ఈ మధ్యకాలంలో వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుండడంతో ఆయా కంపెనీలు కూడా సరికొత్త మోడల్లను మార్కెట్ లోకి తీసుకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల క్రేజ్ అంతకంతకు పెరుగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇండియాలో మొదటిసారిగా గేర్లతో కూడిన తొలి ఎలక్ట్రిక్ మోటార్ బైక్ రాబోతోంది.

టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ మ్యాటర్ గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్‍ను ఆవిష్కరించింది. అహ్మదాబాద్‍ లోని కంపెనీ ఫ్యాక్టరీ లో ఈ బైక్‍లను ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో తొలి ఎలక్ట్రిక్ గేర్ల బైక్ మార్కెట్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ తో కూడిన ఎలక్ట్రిక్ బైక్‍ను మ్యాటర్ కంపెనీ తీసుకురానుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఏడు ఇంచుల టచ్ ఎల్‍సీడీ డిస్‍ప్లే కూడిన వెహికల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈ మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్‍కు ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్‍ తో వస్తుండడంతో స్మార్ట్ ఫోన్‍ ను ఈ బైక్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీడ్, గేర్ పొజిషన్, రైడింగ్ మోడ్, నావిగేషన్, నోటిఫికేషన్ ఎలర్ట్స్, మ్యూజిక్ ప్లే బ్యాక్, కాల్ కంట్రోల్ లాంటి ఫంక్షన్స్ ఈ బైక్ డిస్‍ప్లే నుంచి తెలుసుకోవచ్చు. కాగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇండియాలోనే తొలి ఎలక్ట్రిక్ గేర్ బైక్ కానుంది.

కాగా ఈ బైక్ బ్యాటరీ 5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. మన ఇళ్లలో ఉండే సాధారణ 5ఎ సాకెట్‍తో కూడా ఈ బైక్ ని చార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ మేనేజ్‍మెంట్ సిస్టమ్, డ్రైవర్ ట్రైన్ యూనిట్, పవర్ కన్జర్వేషన్ మాడ్యూల్స్, లాంట్ ప్రొటెక్షన్ సిస్టమ్‍లను ఈ బైక్ కలిగి ఉండనుంది. అలాగే ఈ బైక్ ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే ఈ బైక్ 125 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వస్తుంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ తో భారత్‌లో లాంచ్ కానున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే. 2023 తొలి క్వార్టర్ లో మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ మొదలవుతాయని మ్యాటర్ ఎనర్జీ వెల్లడించింది. 2023 ఏప్రిల్ నాటికి బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయి. కాగా ఈ ఎలక్ట్రిక్ బైక్ నియాన్, బ్లూ, గోల్డ్, బ్లాక్, గోల్డ్ కలర్స్ లో లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  Last Updated: 22 Nov 2022, 07:09 PM IST